ఆరోగ్యశ్రీ ఉద్యోగస్తుల సంఘo కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా అల్లావుద్దీన్…
కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్10 (జనంసాక్షి);
కామారెడ్డి జిల్లా ఆరోగ్యశ్రీ ఉద్యోగుల నూతన జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.కామారెడ్డి జిల్లా ఆరోగ్యశ్రీ ఉద్యోగుల నూతన జిల్లా కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లాలోని ఆరోగ్యశ్రీ శాఖలోని సిబ్బంది సమావేశమై పలు సమస్యలు చర్చించారు. అనంతరం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కృష్ణ వర్ధన్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘo జిల్లా అధ్యక్షునిగా మహమ్మద్ అలావుద్దీన్ ( కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ మిత్ర) ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఉపాధ్యక్షులుగా సుధీర్ (బాన్సువాడ) , ప్రధాన కార్యదర్శిగా సాయిబాబా (ఎల్లారెడ్డి) సంయుక్త కార్యదర్శిగా ఇటికల మహేష్ ( కృష్ణాజివాడి) కోశాధికారిగా జి మహేందర్ ( అన్నారం) సలహాదారుడుగా డి గంగాధర్ ( రామారెడ్డి) మహిళ కార్యదర్శిగా జనని రాణి ( బస్వాపూర్) పద్మ ( బాన్సువాడ)కార్యవర్గ సభ్యులుగా అంజయ్య, అనిల్, సందీప్ ,క్రాంతి గౌడ్, రాజు, లక్ష్మారెడ్డి, నిర్మల, నరసవ్వ, శివాజీ, సంతోష్, కాశమని, మధుసూదన్, తిలోత్తమ, వినోద, తదితులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కామారెడ్డి జిల్లా ఆరోగ్య శ్రీ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన మహమ్మద్ అల్లావుద్దీన్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి కామారెడ్డి జిల్లాలోని ఆరోగ్యశ్రీ ఉద్యోగస్తుల జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కామారెడ్డి జిల్లాలోని ఆరోగ్యశ్రీ ఉద్యోగస్తులకు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని ఆరోగ్యశ్రీ ఉద్యోగుస్తుల సమస్యల పరిష్కారం కోసం , నా తోటి ఉద్యోగస్తుల హక్కుల సాధన కొరకు న్యాయమైన డిమాండ్ల కోసం తాను ఎల్లవేళలా అండగా ఉండి కృషి చేస్తానని తెలిపారు. అలాగే ఆరోగ్యశ్రీ ఉద్యోగుల న్యాపరమైన హక్కుల కోసం , సమస్యల పరిష్కారం కోసం అనుక్షణం ముందుండి పాటుపడతానని తెలిపారు… యూనియన్ సభ్యులు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య శ్రీ పథకానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు పేరు ఫ్రాక్యతలు తీసుకొచ్చినటువంటి ఘనత ఆరోగ్య మిత్రలది… కావున ఆరోగ్య మిత్రల ను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల సేవలను గుర్తించి ఆదుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా చాలు చాలని జీతాలతో తమ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వాo దృష్టికి తీసుకెళ్లి సమస్యకు పరిష్కారం చూపేలా కార్యక్రమాలు జిల్లా కమిటీ ద్వారా చేపడతారని తెలిపారు. అంతే కాకుండా ఆరోగ్యశ్రీ ఉద్యోగులుగా కొనసాగుతున్న ఆరోగ్య మిత్రులు ఆరోగ్యశ్రీ తో పాటు తెలంగణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన
ఇయచ్ యస్ పథకం, జె యచ్ యస్
పథకం తో పాటుగా కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ పథకం కూడ ఆరోగ్యశ్రీ మిత్రలే అదనపు పని చేస్తూ రాష్ట ప్రభుత్వానికి సేవలు అందించడం జరుగుతుంది. కవున ఆరోగ్యశ్రీ మిత్రల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఉద్యోగులూ కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా లోని 22 మండలాలలోని పని చేసే ఆరోగ్యశ్రీ ఉద్యోగులు పాల్గొన్నారు.