ఆరోగ్య శాఖ‌ అలర్ట్ గా ఉండాలి

 

* సీజనల్ వ్యాధులను నియంత్రించాలి

* బూస్టర్ డోస్ వేసుకోండి

* రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
వ‌ర్షాలు త‌గ్గినా సీజ‌నల్ వ్యాధులు పెరిగే అవ‌కాశం ఉంద‌ని, ఆరోగ్య శాఖ అలర్ట్ గా ఉండాలని అధికారుల‌ను బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు.
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ఈ సీజనల్ వ్యాధులు చాలా వరకు తగ్గాయ‌న్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా సుర‌క్షిత మంచినీటి స‌రఫ‌రాతో చాలా వరకు అంటూ వ్యాధులు, సీజనల్ వ్యాధులు చాలా తగ్గాయ‌ని స్ప‌ష్టం చేశారు.
వర్షాల అనంతరం ప్ర‌బ‌లుతున్న సీజ‌నల్ వ్యాధుల‌పై జిల్లాస్థాయి అధికారులతో మంత్రి గంగుల కమలాకర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఐదేండ్ల క్రితం వ‌ర్షాలు త‌గ్గిన త‌ర్వాత డెంగ్యూ వ్యాధి విజృంభించిన విష‌యాన్ని గుర్తు చేశారు. మ‌లేరియా, డెంగ్యూ కేసులు పెర‌గ‌కుండా నివార‌ణ చర్య‌లు తీసుకుంటున్నామ‌ని, అన్ని జిల్లాల్లో కిట్స్ అందుబాటులో ఉంచామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి ఆదివారం హెల్త్ టీమ్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యించామ‌ని చెప్పారు. నిల్వ ఉన్న నీటి ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందుతుంద‌న్నారు. ప్రజలందరూ తమ తమ ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వనికి సహకరించాలని కోరారు.

★ ప్రభుత్వ హాస్టల్ లో సన్న బియ్యం

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో, హాస్ట‌ల్స్‌లో మ‌ధ్యాహ్న భోజ‌నం క్వాలిటీ ఉండేలా చూసుకోవాల‌ని అధికారులకు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు త‌నిఖీలు చేయాల‌ని ఆదేశించిన‌ట్లు పేర్కొన్నారు.

● బూస్ట‌ర్ డోస్ వేసుకోండి..

బూస్ట‌ర్ డోస్ వేసుకోవాల‌ని ప్ర‌జ‌లంద‌రికీ విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ట్లు తెలిపారు. క‌రోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ప్రభుత్వనికి సహకరించాలని కోరుతున్నామ‌న్నారు. ప్రజాప్ర‌తిధులు, అధికారులతో సమన్వ‌యం చేసుకోవాల‌ని సూచించిన‌ట్లు చెప్పారు.