ఆర్ఎంపి, నర్సింగ్ హోమ్ లను తనిఖీ చేసిన మండల వైద్యాధికారి వెంకట్ యాదవ్.
కౌడిపల్లి (జనంసాక్షి).. మెదక్ జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు కౌడిపల్లి మండల కేంద్రంలో గల ఆర్.ఎం.పి సెంటర్లను, నర్సింగ్ హోమ్ లను తనిఖీ చేసినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు వెంకట్ యాదవ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం రోజున జిల్లా వైద్యాధికారుల ఆదేశాల మేరకు కౌడిపల్లి మండల కేంద్రంలోని ఆర్ఎంపి క్లినిక్, నర్సింగ్ హోమ్, ల్యాబ్స్ తదితర వాటిని సందర్శించి అక్కడ గల వసతులను, రికార్డులను పరిశీలించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.