ఆర్కె వన్ ఎ గని, ఆర్కే ఓసిపీని కొనసాగించాలి

టీబీజీకేఎస్ అలసత్వం వల్లనే గనుల మూసివేత

రామకృష్ణాపూర్ , (జనంసాక్షి): మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ ఆర్కే వన్ ఏ గని సమీపంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామకృష్ణాపూర్ ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి, మంచిర్యాల జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షులు యం.డి అక్బర్ అలీ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్బర్ అలీ బుధవారంమాట్లాడుతూ
సింగరేణి యాజమాన్యం ఆర్కె వన్ ఎ గని, ఆర్ కె ఓ సి పి ని అనవసరంగా ముసివేయాలని చూస్తుందని, ఇది సరి కాదని అన్నారు. ఇంకా కొన్ని సంవత్సరాలు సరిపోయే బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ యాజమాన్యం ఏదో ఒక సాకుతో గనిని ముసివేయాలని చూస్తుందని ఆయన మండిపడ్డారు. యాజమాన్యం ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే కార్మికులను కలుపుకుని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఇప్పటికి గుర్తింపు సంఘంగా కొనసాగుతున్న తెరాస అనుబంధ సంఘం టి బి జి కే ఎస్ ఈ ఆర్కె వన్ ఎ గని మూసివేత విషయంలో ఎందుకు మౌనం వహిస్తుందని ప్రశ్నించారు. టి బి జి కే ఎస్ కి ఎంఎల్ఏ, ఎం పి ల మద్దతు ఉన్నప్పటికీ ఆర్కె వన్ ఎ గని మూసివేతని కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయడం లేదని కార్మికులకు గుర్తు చేశారు. సింగరేణి లో గుర్తింపు సంఘం అసమర్ధత వలనఅనేక కార్మిక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. ఇప్పటికయినా యాజమాన్యం రామకృష్ణాపూర్ లో ఉన్నటువంటి ఆర్కె వన్ ఎ గనిని, ఆర్ కె ఓ సి పి ని యాదావిదిగా కొనసాగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 14 అక్టోబర్ నాడు విజయవాడ లో జరుగుతున్న సిపిఐ రాష్ట్ర మహాసభ లకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలనీ కోరారు. ఆదివారం రోజు బెల్లంపల్లి సిపిఐ పట్టణ మహాసభలలోమంచిర్యాల జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షులు గా ఎన్నుకోబడ్డ అక్బర్ అలీ ని ఆర్కే వన్ ఏ గని ఏఐటీయూసీ ఫిట్ కమిటీ సభ్యులు, కార్మికులు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అక్బర్ అలీ రామకృష్ణపూర్ బ్రాంచి పరిధిలో ఉన్నటువంటి కార్మికులకు చేసిన సేవలను కార్మికులు కొనియాడారు. ఈ కార్యక్రమం లో బ్రాంచి ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య, గని ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ సురమళ్ళ వినయ్ కుమార్, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ గోవిందుల రమేష్, ఫిట్ వైస్ ప్రెసిడెంట్ గాజుల రాయమల్లు, ఫిట్ కమిటీ సభ్యులు సుంకరి గట్టయ్య, చెంద్రకాని రమేష్, మెడం బాల్ కోటి రెడ్డి, కారపాక లక్ష్మయ్య, మారం రాజు, సిలివేరు హరీష్, బండి మహేష్, దుగుట హనుమయ్య, సాతప్రశాంత్, రామ్మోహన్, రాజేష్, ఎనగందుల శ్రీకాంత్, గజ్జెల శ్రీనివాస్, తాజోద్దీన్, సంతోష్, ఏఐటీయూసీ కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.