ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి.జిల్లా కలెక్టర్

   నిర్మల్ బ్యూరో, ఆగస్ట్ 29,జనంసాక్షి,,   ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజాఫిర్యాదులలో  భాగంగా   జిల్లా పాలనాధికారి  కార్యాలయం లో  జిల్లా పాలనాధికారి  ముష ర్రఫ్  ఫారుఖీ  అర్జీదారుల నుండి సోమవారం అర్జీలను స్వీకరించారు.ఈ సందర్బంగా వివిధ మండలాల నుండి వచ్చిన దరఖాస్తుదారుల సమస్యలను వింటూ సంబంధిత అధికారులను    తక్షణమే పరిష్కరించాలని  ఆదేశించారు.ఈ సందర్బంగా  22 దరఖాస్తులు  వచ్చాయని,   డబుల్ బెడ్ రూమ్స్,  పెన్షన్స్, కోవిడ్ బారిన పడి   మరణించిన  వారికి   ఇప్పటి వరకు డబ్బులు రాలేదని, తదితర  దరఖాస్తు లు వచ్చాయని తెలిపారు.తహసీల్దార్ లు తమ వద్ద దరఖాస్తు లు  పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని, మండలాల వారిగా ఉన్న పెండింగ్ అర్జీలను రెండు రోజుల్లో  పూర్తి చేయాలని అన్నారు.ఈ గ్రీవెన్స్ లో  అదనపు కలెక్టర్ లు  పి. రాంబాబు,  హేమంత్ బోర్కడే, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.