ఆర్జీలను త్వరితగతిన పరిష్కారించాలి.జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుకి

, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ  అన్నారు.
సోమవారం   జిల్లా పాలనాధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దరఖాస్తు దారుని నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్బంగా ప్రజావాణిలో 10  వివిధ రకాల దరఖాస్తులు వచ్చాయని,  డబుల్ బెడ్ రూమ్ కు సంబందించిన   దరఖాస్తు లు ఎక్కువగా వచ్చాయని జిల్లా పాలనాధికారి తెలిపారు.ప్రజావాణి ద్వారా వచ్చిన  దరఖాస్తులను పరిశీలించి వెంటనే తగు చర్యలు తీసుకొని పరిష్కరించాలని
అట్టి సమాచారాన్ని దరఖాస్తుదారులకు వివరంగా తెలియపరచాలన్నారు. ప్రజావాణి ద్వారా మరింత వేగంగా సేవలు అందించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో  అదనపు  కలెక్టర్ లు  హేమంత్  బోర్కడే,  రాంబాబు ,జిల్లా అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు