*ఆర్టీసీ కార్గో సర్వీస్ సెంటర్ ప్రారంభం*

ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
రామన్నపేట అక్టోబర్ 21 (జనంసాక్షి)
రామన్నపేట మండలంలోని నిర్నేముల గ్రామానికి చెందిన జెట్టి శివప్రసాద్ ఏర్పాటు చేసిన టిఎస్ ఆర్ టి సి వస్తు రవాణా (కార్గో) సెంటర్ ను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం ప్రారంభించారు.వారు  మాట్లాడుతూ కార్గో సేవలను మండలంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, వస్తు రవాణాకు టిఎస్ ఆర్టిసి ఎంతో సురక్షితమైనదని, నమ్మకమైనదని ఆయన అన్నారు. యువత సమయాన్ని వృధా చేసుకోకుండా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. చదువులో ఉన్నత లక్ష్యాలను సాధిస్తూనే, మరోవైపు ఉపాధి మార్గాన్ని మెరుగుపరచుకోవాలని, ఆర్థిక స్వలంబన సాధించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, ఎంపీటీసీ రెహాన్, నాయకులు గోదాసు పృథ్వీరాజ్, జేల్లా  వెంకటేష్, రచ్చ లక్ష్మణ్, ఎండి అక్రమ్, కునూరు కృష్ణగౌడ్, బొడిగె లక్ష్మయ్య, పోతురాజు శంకరయ్య, కోట సుధాకర్, బాల్తు నాగయ్య, సాల్వేరు లింగం, కేశవదాసు వెంకటేశం, పెద్ద గోని వెంకటేశం,నోముల ప్రవీణ్, సుర్వి సతీష్, రమేష్, రాపోలు ఉపేందర్, మోటే రమేష్, చిన్నపాక రమేష్, వైద్యం సాయి తదితరులు ఉన్నారు.
2 Attachments • Scanned by Gmail