ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి
మంచిర్యాల,ఆగస్ట్24 (జనంసాక్షి): ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాధవి బార్ ముందు ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్రవాహన దారుడు మృతి చెందాడు. మృతుడిని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన చంద్రయ్య(39)గా పోలీసులు గుర్తించారు. బస్సు వేంగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. వెంటనే పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు.