ఆర్టీసీ బస్సు నుంచి పడి విద్యార్థికి గాయాలు

రంగారెడ్డి : జిల్లాలోని హయత్‌నగర్‌ మండలం బాటసింగారం వద్ద ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి ఇంజినీరింగ్‌ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. బస్సులు సరిపడా వేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ ఎన్‌హెచ్‌ -9పై విద్యార్థులు రాస్తారోకో చేస్తున్నారు. దీంతో మూడు కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్‌ జాం ఏర్పడింది.