ఆర్టీసీ రూ. 585 కోట్ల నష్టాల్లో ఉంది. ఎండీ
వరంగల్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రూ. 585 కోట్ల నష్టాల్లో ఉందని సంస్థ ఎండీ ఏకే ఖాన్ చెప్పారు. ఈ ఏడాది రెండు వేల కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని ఖాన్ చెప్పారు.