ఆర్థికం అక్షరాస్యత ఎంతో అవసరం..

ప్రతి కుటుంబం ప్రతి ఖాతాదారుకు అక్షరాస్యత ఎంతో అవసరం అని దోమ మండల సర్పంచ్ల సంఘము అధ్యక్షులు కె.రాజిరెడ్డి అన్నారు.మంగళవారం దోమ మండల కేంద్రంలో ఏస్బిఐ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో ఖాతాదారులకు ఆర్థిక అక్షరాష్యత అనే అంశం పై జరిగిన అవగాహన కార్యక్రమం లో మాట్లాడారు ఈ సందర్బంగా ఖాతాదారులు సంతకాలతో లావాదేవీలు జరపాలని అందుకు చదవు ఎంతో అవసరం అని బీమా పతకాల్లో భాగంగా ప్రతి ఖాతా దారుకు బాండ్లు ఇవ్వాలనిమేనేజర్ శ్రీనివాస్ను సర్పంచ్ రాజిరెడ్డి కోరారు బీమా ఉన్న ఖాతా దారులకు చాలా మందికి బాండ్లు లేకపోవడం కుటుంబ సభ్యులకు తెలియక నష్ట పోతున్నారని సర్పంచ్ అన్నారు ఎటిఎం లతో పాటు డిజిటల్ ట్రాంజెక్షన్లు చేయడానికి విద్య ఎంతో అవసరం అన్నారు కార్యక్రమం లో భాగంగా మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతు ప్రతి ఖాతాడారు బీమా చేయించుకొని మా బ్యాంక్ ద్వారా సమయానుకుల లావాదేవీలు జరిపితే అనేక లాభాలు ఉంటాయని చెప్పారు గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్య గౌడ్ ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్ లు మాట్లాడారు ఈ కార్యక్రమం ఎంపీటీసీ బంగ్లా అనితయాదయ్య గౌడ్, మినీ బ్యాంకు సిబ్బంది సుజాతశేఖర్ గౌడ్, గ్రామస్థులు పాల్గొన్నారు.

సర్పంచ్ కె.రాజిరెడ్డి