ఆర్థిక స్థిరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

–  ఏఐఐబీ సమావేశంలో ప్రధాని మోదీ
ముoబయి, జూన్‌26(జ‌నం సాక్షి) : ఆర్థిక స్థిరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. ఆసియా బ్యాంకు ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్ర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌(ఏఐఐబీ) సమావేశం ముంబాయిలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్థికంగా భారత్‌ ముందుకు వెళ్తోందన్నారు. అందరికీ ఆర్థిక అవకాశాలు ఇవ్వాలనే మూలస్తంభం విూదే భారత్‌ నిలబడుతోందన్నారు. ఆర్థిక స్థిరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆర్థిక పరంగా చాన్నాళ్ల తర్వాత భారత్‌కు మంచి రేటింగ్‌ వచ్చిందన్నారు. స్నేహపూర్వక పెట్టుబడులకు భారత్‌ ఉత్తమ స్థానమన్నారు. స్థూల ఆర్థిక స్థిరీకరణ, అభివృద్ధి కోసం పెట్టుబడిదారులు చూస్తుంటారని, రాజకీయ స్థిరత్వాన్ని కూడా ఇన్వెస్టర్లు చూస్తుంటారని ఆయన అన్నారు. ఇన్వెస్టర్ల రక్షణ కోసం స్నేహపూర్వక రెగ్యులరీ వ్యవస్థను తీర్చిదిద్దాలని ప్రధాని సూచించారు. సంపూర్ణ, సమగ్ర ఆర్థిక అభివృద్ధి కోసం ఏఐఐబీ, భారత్‌ కట్టుబడి ఉన్నాయని ప్రధాని చెప్పారు. ఇండియాలో పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నామని ఆయన చెప్పారు. ఆసియా ఖండంలో ఏఐఐబీ బ్యాంకు కీలక పాత్ర పోషిస్తుందని, సమగ్రమైన మౌళిక సదుపాయాల కల్పన వల్ల కోట్లాది ప్రజల జీవితాలు మారుతాయని మోదీ అన్నారు. ఇండ్ల నిర్మాణం కోసం కొత్త టెక్నాలజీ వినియోగం ఉపయోగపడుతుందన్నారు. ఏషియాన్‌ బ్యాంకులో మొత్తం 87 సభ్య దేశాలు ఉన్నాయని, వాటి
మూలధనం సుమారు 100 బిలియన్ల డాలర్లు ఉంటుందన్నారు.