ఆర్ డి ఓ,ఎం ఆర్ ఓ కి రియల్టర్ల వినతిపత్రం…

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఆర్డిఓ,ఎమ్మార్వోల కి శనివారం ముధోల్,బైంసా రియల్టర్స్ఆధ్వర్యంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యేలా,అందుకు తగ్గ అనుమతులను ప్రభుత్వం అనుమతించాలని వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు అరవింద్ మాట్లాడుతూ… ఎల్లరేస్ నిబంధనల ప్రకారం ప్రతి వెంచర్ కి 10000 రూపాయలు చెల్లించామని, గతంలో హైకోర్టు అనుమతితో రిజిస్ట్రేషన్లు జరగగా,మళ్లీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం జరిగింది. ఇప్పటికే వెంచర్లలో సగం ప్లాట్లకు పైగా అమ్ముడు కాగా,మిగతా సగం ప్లాట్లు అలాగే ఉండిపోయాయని, ఇప్పుడు అధికారులు వెంచర్ల లోని పోల్స్ ను తొలగించడంతో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, కొన్ని మార్పులు చేర్పులతో ఈ నెల 31 వ తారీకు వరకు హైకోర్టు అనుమతి ద్వారా రిజిస్ట్రేషన్ కొరకు అనుమతి ఇవ్వాలని కోరారు. వచ్చే సంవత్సరం నుండి డిటి సిపి పర్మిషన్లున్న వెంచర్లకే అనుమతి ఇవ్వాలని అందుకు మేము కూడా సహకరిస్తామని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా కొన్ని బెటర్మెంట్ చార్జెస్ ప్రభుత్వం అర్జించి,రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని ఆర్డీవో కి కోరారు.లేని యెడల రాష్ట్రం లెవెల్లో రియాల్టార్లు పెద్దమొత్త0 లో  ఆఫీసర్స్ కి వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు

తాజావార్తలు