ఆలయ అభివృద్దికి కృషి చేస్తా : మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్

 పరిగి రూరల్, అక్టోబర్ 16 (జనం సాక్షి) :
పరిగిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్దికి కృషి చేస్తానని పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ అన్నారు. పరిగిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు రెండో రోజు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పరిగితోపాటు వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ చిగుళ్లపల్లి మంజుల, నాయకులు చిగుళ్లపల్లి రమేష్ ప్రత్యేక పూజలు చేసి స్వామి వారికి మొక్కులు సమర్పించారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విశేష ద్రవ్య అస్టోత్తర శత కలశాభిషేకం తదితర ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంద్బంగా ఆలయ ధర్మకర్త ఎదిరె సత్యనారాయణ-మాణెమ్మ, ఎదిరె కృష్ణ–పద్మ, ఎదిరె నరేందర్–జయ దంపతులు యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.  ఈ పూజా కార్యక్రమంలో సిద్దాంతి పార్థ సారధి,  భాస్కర్ గుప్త, నాయకులు బేతు ప్రవీణ్ కుమార్ రెడ్డి, వేముల సత్యానారయణ, రఘుమోహన్ రెడ్డి, మాణిక్ రెడ్డి, ఎస్పీ బాబయ్య తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం, సాయత్రం 6.30 గంటలకు కన్నుల పండుగగా స్వామి వారి ఊరేగింపు నిర్వహించనున్నట్లు ఆయల ధర్మకర్త ఎదిరె సత్యనారాయణ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఫోటో రైటప్ :
16 పిఆర్ జి 01లో స్వామి వారి యజ్ఞంలో పూజలు నిర్వహిస్తున్న ఆయల ధర్మకర్త ఎదిరె సత్యనారాయణ, కుటుంబీకులు
02లో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న వికారాబాద్, పరిగి మున్సిపల్ చైర్మెన్లు చిగుళ్లపల్లి మంజులు, ముకుంద అశోక్ కుమార్ తదితరులు
2 Attachments • Scanned by Gmail