ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికరాలు నాగమ్మ సేవలు మరువలేనివి.

నరేంద్ర కుమార్ వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరిండెంట్.

 నాగమ్మ సంతాప సభలో ఏఐటీయూసీ నేత పి.సురేష్.
వనపర్తి సెప్టెంబర్ 1(జనంసాక్షి)వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న నాగమ్మ అకాల మృతి తీవ్రంగా కలిసి వేసిందని ఆమె ఆసుపత్రికి చేసిన సేవలు మరువలేనివని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ నరేందర్ కుమార్ అన్నారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో మంగళవారం అకాలంగా మరణించిన ఆసుపత్రి కార్మికురాలు వి.నాగమ్మ జ్ఞాపకార్థకంగా గురువారం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికులు నాగమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం సంతాప సభ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్.నరేంద్ర కుమార్ మాట్లాడుతూ వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్ పారిశుద్ధ కార్మికురాలైన నాగమ్మ ఆసుపత్రికి వెలకట్టలేని సేవలు అందించిందని అన్నారు. అందరితో కలివిడిగా ఉంటూ విధుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ రోగులతో ఎంతో ఆప్యాయంగా మెలిగేదని నాగమ్మ సేవలకు ఎన్నో అవార్డులు కూడా అందించడం జరిగిందని అన్నారు. గత 15 రోజుల కిందట నాగమ్మ ఏకైక కుమారుడైన భాస్కర్ తీవ్రమైన అనారోగ్యంతో మరణించాడని దాని నుండి కోలుకోకముందే గత రెండు రోజుల కిందట నాగమ్మ భర్త రాఘవులు కూడా మరణించాడని దీన్ని తట్టుకోలేని నాగమ్మ నిమిషాల వ్యవధిలోనే తీవ్రమైన వాంతులు విరేచనాలతో అనారోగ్యానికిగురై అకాలంగా మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. నాగమ్మ మరణాన్ని ఆసుపత్రి సిబ్బంది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. నాగమ్మ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పి.సురేష్ మాట్లాడుతూ కామ్రేడ్ నాగమ్మ మృతి ఆమె కుటుంబానికి కాక కార్మిక వర్గ పోరాటాలకు తీరని లోటని అన్నారు.రోజుల వ్యవధిలోని నాగమ్మ కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు వదలడం అత్యంత విషాదకరమని అన్నారు. పేదరికంలో జీవిస్తున్న ప్రేమ ఆప్యాయతలు పంచడంలో నాగమ్మకు సరి లేరని అన్నారు. నాగమ్మ భాస్కరు ఇద్దరు కూడా వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులుగా పని చేశారని గుర్తు చేశారు.నాగమ్మ కుటుంబానికి ప్రభుత్వం పది లక్షలుగా ఎక్స్ గ్రేషియా,డబల్ బెడ్ రూమ్ ఇల్లు,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్ఎంవో శివప్రసాద్, కార్మికులు నరసింహ,బాలరాజ్, భరత్, శ్రీనివాస్,కుమార్,బాబు,అనిల్,ముజాహిద్, కలవతమ్మ,నాని,అనిత,కవిత,చెన్నమ్మ,సంగీత తదితరులు పాల్గొన్నారు.