ఆహార భద్రత బిల్లుపై కోర్‌కమిటీలో చర్చ

న్యూఢల్లీ,(జనంసాక్షి): ప్రధాని నివాసంలో భేటీ అయిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ప్రధానంగా ఆహార భద్రత బిల్లు చట్టబద్ధమైన చర్చించింది. ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు ఏర్పాటు చేసి ఆహార భద్రతా బిల్లును ఆమోదించాలని నిర్ణయించింది.  ఒకవేళ పార్టీలు సహకరించకపోతే ఆర్డినెన్స్‌ రూపంలో బిల్లును తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల అంశంపై ఇతర పార్టీలతో అధికార పార్టీ నేతలు చర్చించనున్నారు.