ఆ ఇద్దరు దొంగలూ ఒక్కటయ్యారు
గజ్వేల్‌లో ప్రతాప్‌రెడ్డి, నర్సారెడ్డిల మాటలు నమ్మొద్దు
కెసిఆర్‌తోనే తెలంగాణ అభివృద్ది సాధ్యం
రైతులకు అండగా నిలిచింది టిఆర్‌ఎస్ మాత్రమే
మరోమారు ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు
గజ్వేల్,నవంబర్5(జనంసాక్షి): గజ్వేల్‌లో ప్రతాప్‌రెడ్డి, నర్సారెడ్డి అనే ఇద్దరు దొంగలు ఒక్కటయ్యారని మంత్రి హరీష్‌రావు ఘాటుగా విమర్శించారు. వారు లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను గందరగోళంలో పడేలా చేస్తున్‌ఆనరని, వారి మాటలు నమ్మవద్దన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని హరీష్‌రావు పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు సోమవారం ఉదయం మరోమారు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొల్గూరులో మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ గెలిస్తే పెన్షన్ రూ. 2016కు పెంచుతామని, పంట పెట్టుబడి సాయం ఎకరాకు రూ. 10 వేలు ఇస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు బీమా కల్పించామన్నారు. బతుకమ్మ చీరల పంపిణీని అడ్డుకున్న కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. వంటేరు ప్రతాప్‌రెడ్డి, నర్సారెడ్డి ఇద్దరూ దొంగలే.. ఆ దొంగలు ఇప్పుడు ఒక్కటయ్యారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. గజ్వేల్‌లో అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. గజ్వేల్‌లో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. గజ్వేల్ అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలి. రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం రూ. 10 వేలకు పెంచుతామన్నారు. పేద రైతులు చనిపోతే రైతు బంధు బీమా పథకం కింద పరిహారం అందిస్తున్నామని గుర్తు చేశారు. బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు అందిస్తున్నామని చెప్పారు. టీఆర్‌ఎస్ నేతలు అభివృద్ధి పనులు చేస్తుంటే.. కాంగ్రెస్ అడ్డుకుంటుందని ధ్వజమెత్తారు. బతుకమ్మ చీరలను అడ్డుకున్న కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలన్నారు. కొల్గూరును దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.