ఆ ఫ్రాంచైజీ సచిన్‌దేనా…?
ఐబీఎల్ ముంబై ఫ్రాంచైజీపై అనుమానాలు
సచిన్ సెకండ్ ఇన్నింగ్స్
భారత బ్యాడ్మింటన్‌లో ఎంట్రీపై ఉహాగానాలు
త్వరలో ప్రారంభకానున్న ఐబీల్
మరో కాసుల పంటకు భారత్ వేదిక
30న వేలం
ముంబై, జూన్ 20 (జనంసాక్షి) :
ఐపీఎల్ తరహాలోనే నిర్వహిస్తోన్న ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో సచిన్ ఫ్రాంచైజీ కొనుగోలు చేశాడా… ముంబై టీమ్‌కు మాస్టరే ఓనరా… అంటే అవుననే సమాధానం వస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న ఐబీఎల్‌లో ముంబై ఫ్రాంచైజీని ఒక ప్రముఖ క్రికెటర్ కొనుక్కున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత ఏడాది వన్డేలకు గుడ్‌బై చెప్పిన సచిన్ బ్యాడ్మింటన్‌ను ప్రమోట్ చేసేందుకు ముందుకొచ్చాడని, దానిలో భాగంగానే ముంబై మాస్టర్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అయితే నిర్వాహకులు దీనిని ఇంకా ధృవీకరించలేదు. భారత బ్యాడ్మింటన్‌లో కీలకవర్గల సమాచారం ప్రకారం ఒక ప్రముఖ క్రికెటర్ లీగ్‌లో వాటాదారునిగా ఉన్నాడని తెలిసింది. ప్రస్తుతం లీగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం నిర్వాహకులు వెల్లడించలేదు. ఒక్క హైదరాబాద్ ఫ్రాంచైజీని మాత్రం పివిపి వెంచర్స్ కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. మిగిలిన ఫ్రాంచైజీలలో పుణెళి కోసం డాబర్ గ్రూప్, లక్నో కోసం సహారా ఇండియా రేసులో ఉండగా… బెంగళూర్, ఢిల్లీ ఫ్రాంచైజీలపై కొన్ని కార్పొరేట్, రియల్ ఎస్టేట్ సంస్థలు ఆసక్కి చూపిస్తున్నాయి. త్వరలోనే ఫ్రాంచైజీలకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తామని ఐబీఎల్ ప్రతినిధి ఆశిష్ చడ్డా చెప్పారు. ఆగష్ట్ 14 నుండి 31 వరకూ జరగనున్న ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ఆరు జట్లు పోటీపడనున్నాయి. భారత్ షట్లర్లు సైనా, జ్వాలా, కష్యప్, సింధు, అశ్విని పొన్నప్ప లీగ్‌కు ఐకాన్ ప్లేయర్స్‌గా ఎంపికయ్యారు. పలువురు అంతర్జాతీయ ఆటగాళ్ళు కూడా దీనిలో ఆడనున్నారు. వీరి కోసం జూన్ 30న వేలం నిర్వహించనున్నారు. మొత్తం ఒక మిలియన్ డాలర్లను ప్రైజ్‌మనీగా కేటాయించారు.
ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ :
తొలి సీజన్ : ఆగష్ట్ 14 నుండి 31 వరకూ
ప్రైజ్‌మనీ : 1 మిలియన్ డాలర్లు
వేదికలు : ముంబై, పుణెళి, న్యూఢిల్లీ, లక్నో, హైదరాబాద్, బెంగళూర్
ఐకాన్ ప్లేయర్స్ : సైనానెహ్వాల్, గుత్తా జ్వాల, పివి సింధు, అశ్విని పొన్నప్ప, పారుపల్లి కష్యప్
ఆటగాళ్ళ వేలం : జూన్ 30