ఇంజినీరింగ్ కళాశాలకు బాంబు బెదిరింపు
మేడ్చల్: రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌కు సమీపంలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో రెండు బాంబు స్వ్యాడ్ బృందాలతో మేడ్చల్ పోలీసులు కళాశాలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబు లేకపోవడంతో ఇది ఆకతాయి పనేనని పోలీసులు భావిస్తున్నారు. ఫోన్ నెంబర్ ఆధారంగా వివరాలు తెలుసుకొని ఆకతాయిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.