ఇంటర్ స్థాయి విద్యార్థికి ఎంతో ప్రాముఖ్యమైనది

ఇంటర్ స్థాయి విద్యార్థికి ఎంతో ప్రాముఖ్యమైనది

టేకులపల్లి,అక్టోబర్ 17( జనం సాక్షి ): ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ స్థాయిఎంతో ప్రాముఖ్యత కలిగినదని,ఉన్నత విద్యను అభ్యసించడానికి దోహదపడుతుందని ప్రభుత్వ జూనియర్ కళాశాల టేకులపల్లి ప్రిన్సిపాల్ కల్పన విద్యార్థులకు సూచించారు. మంగళవారం టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సర విద్యార్థులు ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఏర్పాటుచేసిన “ఫ్రెషర్స్ డే”వేడుక ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. కల్పన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ స్థాయి ఎంతో ముఖ్యమైనదిగా ఉంటుందని, ఒడిదుడుకులతో కూడినదని, కాబట్టి విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకొని వారు ఏర్పరచుకున్న లక్ష్యాన్ని సాధించాలని కోరారు.
సెల్ ఫోన్లు, ఫ్యాషన్ల మోజుకి గురికాకుండా తల్లిదండ్రులు వారిపై ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా జీవితంలో ఉన్నత లక్ష్యాలను అలవర్చుకొని, వాటిని సార్థకం చేయడానికి నిరంతరం కృషి చేస్తూ ముందుకు సాగాలని కోరారు. విద్యార్థినీ,విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఉత్సాహభరితంగా జరిగినవి. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జయశ్రీ కృష్ణమూర్తి, బసవమ్మ సత్యవతి, ముంతాజ్ అలీ, శంకర్రావు వేణుగోపాల్,యాఖుబ్, వరలక్ష్మి,ప్రమోద్ కుమార్, నాగేశ్వరరావు, బుల్లారావు, రమేష్,చైతన్య తదితరులు పాల్గొన్నారు.