ఇంటింటా ఇన్నోవేటర్ ప్రదర్శనకు జిల్లా నుంచి ఇద్దరు ఎంపిక.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగస్టు14(జనంసాక్షి):
జులై మొదటి వారం నుండి ఆగస్టు 10 వరకు ఆన్లైన్లో నమోదు చేసిన ప్రదర్శనల నుండి రెండు ప్రదర్శనలు ఎంపిక కావడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా నుండి ఆన్లైన్లో 15 ప్రదర్శనలు నమోదు చేయడం జరిగిందని అందులో నుండి రెండు ప్రదర్శనలు ఎంపిక కావడం జరిగింది. అందులో ఒకటి గణేష్ ఎనిమిదో తరగతి ప్రభుత్వ ఉన్నత పాఠశాల అచ్చంపేట విద్యార్థి తక్కువ ఖర్చుతో రూపొందించిన కుండ కూలర్, రెండవది సలీం అనే మారెపల్లికి చెందిన వ్యవసాయదారుడు రూపొందించిన గాలితో విద్యుత్ ఉత్పత్తి.ఈ రెండు ప్రదర్శనలు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేపు పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో ప్రదర్శన ఉంటుందని అన్నారు.ఇంటింటా ఇన్నోవేటర్ కి ఎంపికైన గణేష్ అనే విద్యార్థిని, సలీం అనే వ్యవసాయదారున్ని మరియు ఇంటింటా ఇన్నోవేటర్ నమోదు ప్రక్రియలో అవగాహన కల్పించిన జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి ని జిల్లాకలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు