ఇంటింటా బాధ్యతగా మొక్కలు నాటాలి..
– కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 08(జనం సాక్షి)
హరితహారం కార్యక్రమంలో భాగంగా 42వ డివిజన్లోని ప్రతి ఇంటికి ఆర్ పి ల ద్వారా మొక్కలను అందజేస్తున్నామని, ప్రజలందరూ కూడా వారి వారి ఇండ్లలో బాధ్యతగా మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవాలని కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్ అన్నారు సోమవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా రంగశాయిపేట లోని మహిళా స్వశక్తి భవన్లో మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినారు.
ఈ సందర్భంగా చందన పూర్ణచందర్ మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి వచ్చిన మొక్కలను మెప్మా కు చెందిన ల ద్వారా డివిజన్లోని ఇంటింటికి పంపిణీ చేయించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని వారి వారి ఇండ్లలో మొక్కలను నాటుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మెప్మా కు చెందిన ప్రవీణ్, బజ్జూరి సురేఖ, ఎలుగు రమ, మాడిశెట్టి కవిత, చిమ్మని భార్గవి, శ్రీకళ, మహేశ్వరి, పోతు రమాదేవి, శంకేసి రాధిక, అడుప కవిత తదితరులు పాల్గొన్నారు.