ఇంటింటా మువ్వన్నెల జెండా ప్రతి పౌరుడు గుండె నిండా దేశభక్తిని చాటుకోవాలి
కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) ఇంటింటా మువ్వన్నెల జెండా ఎగురవేసి ప్రతి పౌరుడు గుండె నిండా దేశభక్తిని చాటుకోవాలని కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. 75 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా వేడుకలను అంగరంగ వైభవంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుపుకోవాలని భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు కో – ఆపరేటివ్ బ్యాంకు కాలనీ, మమతా నగర్ కాలనీ, అజయ్ నగర్, రాక్ టౌన్, రాక్ హిల్స్, ఇంద్రప్రస్థ కాలనీ, స్వామి నారాయణ కాలనీ, శ్రావణ్ ఎంక్లేవ్ తదితర కాలనీలో ఇంటి ఇంటికి జాతీయ జెండాలు పంపిణీ కార్యక్రమంలో నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ నెల 13, 14, 15 తేదీలలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురు వేయాలని కోరారు. దేశ సమైక్యత కోసం ప్రధాని పిలుపు మేరకు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగం కావాలని వారు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. .
