ఇంటింటి ఆరోగ్య సర్వేలో పాల్గొన్న ఎం.పి.డి.ఓ, ఎం.పి.ఓ.

కోటగిరి జూలై జనం సాక్షి:- కోటగిరి మండల కేంద్రంలో పోతంగల్ గ్రామంలోబుధవారం రోజున జరుగుతున్న ఇంటింటి ఆరోగ్య సర్వేను ఎం.పి.డి.ఓ,ఎం.పి.ఓ పరిశీలించారు.ఈ

పరిశీలనలో భాగంగా ఎం.పి.డి.ఓ, ప్రజలకు డెంగ్యూ,మలేరియా వ్యాధుల పట్ల అవగాహన కల్పించి,ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వారిని,1,2,3 వ్యాక్సిన్ వేసుకొని వ్యక్తులను వెంటనే గుర్తించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు.
ప్రజలు తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరి శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.గ్రామంలోని హోటళ్లను, దుకాణాలను,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను ,స్వీట్ హోమ్ లను, బేకరిలను,చికెన్,మటన్ సెంటర్లను పరిశీలించి వారికి పలు సూచనలు చేస్తూ తినుబండారాలు తాజాగా తయారు చేయాలని,వాటికి జాలీ తప్పక వాడాలని,వంట వండే స్థలమును అపరిశుభ్రంగా ఉంచకూడదని, ప్రతి రోజు బ్లీచింగ్ పౌడర్ వాడాలని వ్యాపార యజమానులకు తెలిపారు.పై విషయంలో దుఖానుదారులు పాటించని యెడల మొదట యజమానులకు నోటీసు ఇచ్చి తరువాత కుడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం మొదటి 5000/-రూ,,తరువాత 10000/- రూ,, జరిమానా విధించబడునని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ వర్ని శంకర్,పంచాయతీకార్యదర్శి,
ఆశా వర్కర్లు,జీపీ సిబ్బంది పాల్గొన్నారు.