*ఇంటికో ఉద్యోగం ఇస్తామని జాతీయ పార్టీలు ప్రకటిస్తే మా పదవులకు రాజీనామా చేస్తాం*

టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని తమ పార్టీ ఎప్పుడు ప్రకటించలేదని అలా జాతీయ పార్టీలు ఇంటికో ఉద్యోగం ఇస్తామని ముందుకు వస్తే తాము ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ వాళ్లకు అప్పగించి అధికారాన్ని వాళ్ళ చేతుల్లో పెడతామని జాతీయ పార్టీ నాయకులకు సవాల్ విసిరారు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇటీవల భారత ప్రధాని విజయ సంకల్ప సభలో తెలంగాణకు ఎలాంటి హామీ ఇవ్వలేదని మరోవైపు ఉద్యోగాల పట్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ బిజెపి శ్రేణుల మధ్య వివాదం రాజుకుంది…మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయిన్పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పాలషీతలీకరణ కేంద్రం భవనాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇటీవల రాజధానిలో విజయ సంకల్ప సభ లో  ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు ఏవైనా హామీలు ఇస్తారని చూసినా తమ రాష్ట్రానికి ఎలాంటి హామీ ఇవ్వలేదని బిజెపి పార్టీను విమర్శించడంతో అక్కడే వేదిక పైన ఉన్న బిజెపి పార్టీకి చెందిన వైస్ ఎంపీపీ తిరుపతమ్మ ఒక్కసారిగా ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డారు. ఏవైనా అభివృద్ధి చేసి ఉంటే మీ పార్టీ పైన చేసుకోండి అని తమ పార్టీని కించపరిచే విధంగా మాట్లాడవద్దని ఆమె ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు వైస్ ఎంపీపీ భర్త రవికుమార్ కూడా బిజెపి పార్టీ యొక్క పథకాలను ఎందుకు రాష్ట్రంలో ప్రజలకు వివరించి చెప్పడం లేదని నిలదీశారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇది ఇలా ఉండగానే తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాము ఎప్పుడు చెప్పలేదని ఒకవేళ కేంద్ర పార్టీలు వచ్చి ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇస్తే వెంటనే తమ పదవులకు అందరం రాజీనామా చేసి తమ పార్టీని కేంద్ర పార్టీకి అప్పజెప్పి అధికారాన్ని వారి చేతుల్లో పెడతామని  ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వ్యాఖ్యలు చేశారు…