*ఇంటి తాళాలు పగల గొట్టి చేతివాటం చూపించిన దొంగలు*

బాల్కొండ జూలై   ( జనం సాక్షి)  నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో  పెండరీ శేకర్  తన ఇంటికి తాళం వేసి ఫంక్షన్ కి వెళ్ళగా అతని ఇంట్లో  శుక్రవారం రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో ప్రవేశించి బెడ్రూం లోని బీరువా తెరిచి బీరువా నుండి సుమారు 16 తులాల బంగారు ఆభరణాలు , రెండు లక్షల రూపాయల నగదు ఒక సెల్ ఫోన్ దొంగించినారు. ఇట్టివిషయం లో కేసు నమోదు చేసి ఆర్మూర్ రూరల్ సీఐ గోవర్ధన్ రెడ్డి, బాల్కొండ ఏ ఎస్సై శంకర్, సంఘటన స్థలన్నీ సందర్శించి  పెండరీ శేకర్ మేరకు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.అని సీఐ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.