ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించిన గ్రామస్తులు

 

ఇంటి పై కప్పు రేకుల నిర్మాణానికై 14000/- వేల రూపాయలు,50 కిలోల బియ్యం
జనం సాక్షి నర్సంపేట
మగ్ధుంపురం గ్రామం లోని కోట రాజు అనే గ్రామస్తుడికి తల్లిదండ్రులు అకాల మరణం చెందగా, రాజు అంగవైకల్యంతో ఒంటరిగా జీవిస్తూ కాలం సాగిస్తున్నా క్రమంలో తన ఇల్లు కృంగిపోవడంతో చూసి చెలించిన గ్రామస్తులు తనకు ఆర్థిక సాయం గా ఇంటి పై కప్పు (రేకుల) నిర్మాణానికై 14000/- వేల రూపాయలు,50 కిలోల బియ్యం ,తదితర సామాన్లు అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆర్థిక సాయం అందించిన వారు ఆంగోత్ కృష్ణలాల్, పెండ్యాల ప్రభాకర్, చందావత్ ఈర్య ,చల్ల రామచందర్ రెడ్డి, చింతకాయల మహేందర్, బైరగోని రాజు, వెల్దండి జ్యోతిబాస్,ఎగ్గడి సదానందం,మండ కార్తీక్ గౌడ్, ఇరుకు రవీందర్,కోల రాజు కుమార్,పెండ్యాల సదానందం,వెల్దండి మధు,వెల్దండి మార్కండేయ,సింగం భాస్కర్,ఇస్లావత్ రవి, ఇస్లావత్ లింగ,ఇస్లావత్ నరాన్,ఆరెల్లి ప్రభాకర్,ఎగడ్డి అనిల్,ఆంగోత్ నర్సు,ఇస్లావత్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.