ఇంట్లోకి దూసుకుపోయిన లారీ.. ఇద్దరికి తీవ్రగాయాలు

వరంగల్‌ : హన్మకొండ పెద్దమ్మగడ్డలో ఈ ఉదయం లారీ అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.