ఇండియన్స్‌ సూపర్‌ విక్టరీ

తడాకా చాటిన ముంబయి

కోల్‌కతాపై సూపర్‌ విక్టరీ

మాస్టర్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌

ముంబై, మే 7 (జనంసాక్షి) :

ముంబై ఇండియన్స్‌ ధాటికి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కుప్పకూలింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. సచిన్‌ టెండుల్కర్‌ మెరుపులు మరిపించాడు. సచిన్‌ 28 బంతుల్లో 48 పరుగులు చేశాడు గత కొన్ని మ్యాచ్‌లలో పేలవ ప్రదర్శనతో నిరాశపర్చిన సచిన్‌ ఈ మ్యాచ్‌లో మెరిసాడు. బ్యాటింగ్‌లో స్మిత్‌ (47), శర్మ(16), పోలార్డ్‌(16), రాయుడు(0), హర్బజన్‌(0) పరుగులు చేశారు. కార్తిక్‌(34), జాన్సన్‌(10) పరుగులతో అజేయంగా నిలిచారు. కోల్‌కత్తా బౌలర్లలో బాలాజి రెండు, మెక్లారన్‌ రెండు వికెట్లు, నరైన్‌, కల్లిస్‌ తలో వికెట్‌ తీశారు. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఆదిలోనే ఎదురుదెబ్బతగిలింది. జాన్సన్‌ మొదటి ఓవర్లో నాలుగో బంతికి గంభీర్‌ వికెట్‌ తీశాడు. ముంబై ఇండియన్‌స బౌలర్ల ధాటికి కోల్‌కతా ఏ దశలోనూ నిలవలేక పోయింది. జాన్సన్‌ నాలుగు ఓవర్లకు కేవలం 18 పరుగుల మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. హర్బజన్‌సింగ్‌ కేవలం 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. బాలర్లలో ఓజా రెండు, అహ్మద్‌, మలింగ తలో వికెట్‌ తీశారు. ముంబై ఇండియన్స్‌ 65 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.  సచిన్‌ టెండుల్కర్‌ మ్యాన్‌ అఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

స్కోర్‌ వివరాలు :

ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ :

స్మిత్‌ (సి) మెక్‌ లారెన్‌ (బి) ఇక్బాల్‌ అబ్దూల్లా 47(4I7),     సచిన్‌ (బౌల్డ్‌) రాజత్‌ భాటియా 48(4I8), దినేష్‌ కార్తిక్‌ నాటౌట్‌ 34 (4I3, 6I2), రోహిత్‌ శర్మ (సి) ఇవొయిన్‌ మోర్గాన్‌ (బి) మెక్‌ లారెన్‌ 16 (4I1, 6I1), కీరన్‌ పోలర్డ్‌ (సి) సునీల్‌ నరీన్‌ (బి) మెక్‌ లారెన్‌ 4(4I1), అంబటి రాయుడు రనౌట్‌ యూసఫ్‌ పఠాన్‌ 0, హర్భజన్‌ సింగ్‌ రనౌట్‌ రాజత్‌ భాటియా 0, జాన్సన్‌ 10 (6I1).ఎక్సాట్రాలు : 11 ( బైస్‌-0, వైడులు-10, నోబాల్‌-0, లెగ్‌ బై-1, ఫెనాల్టీ -0)

మొత్తం : 170 (20 ఓవర్లకు 6 వికెట్లు)

వికెట్ల పతనం :  1-93(సచిన్‌ 12.6), 2-99(స్మిత్‌ 13.3), 3-130(రోహిత్‌ శర్మ 17.1), 4-134(కీరన్‌ పోలర్డ్‌  17.5), 5-135(రాజత్‌ భాటియా 17.6), 6-144(హర్భజన్‌ సింగ్‌ 18.3) మిగిలిన బ్యాట్స్‌మేన్‌ :  మలింగ, ఓజా, అహ్మద్‌

ముం బౌలింగ్‌ : బాలాజీ 3-1-7-0, మెక్‌ లారెన్‌ 4-0-60-2, సునీల్‌ నరీన్‌ 4-0-29-0, జెహెద్‌ కలిస్‌ 3-0-21-0, ఇక్బాల్‌ అబ్దూల్లా 30-1-30-1, రాజత్‌ భాటియా 2-0-22-1.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బ్యాటింగ్‌ :

మన్విందర్‌ బిస్లా (స్టం) దినేష్‌ కార్తిక్‌ (బి)ప్రగ్యాన్‌ ఓజా 17(4I3), గంభీర్‌ (బౌల్డ్‌)0, కలిస్‌ (సి) అబు నచిమ్‌ (బి) హర్భసన్‌ సింగ్‌ 24(4I2, 6I1), ఇవొయిన్‌ మోర్గాన్‌ (సి) రోహిత్‌ వర్మ (బి) అబు నచిమ్‌ 5, యూసఫ్‌ పఠాన్‌ (బౌల్డ్‌) ప్రగ్యాన్‌ ఓజా 13(4I1, 6I1), దెబబ్రటా దాస్‌ (సి)(బి) హర్బజన్‌ సింగ్‌ 23(4I2,6I2), రియాన్‌ మెక్‌ లారెన్‌ రనౌట్‌ రోహిత్‌ శర్మ 1, రాజత్‌ భాటియా (సి) మలింగ (సి) హర్భజన్‌ సింగ్‌ 4, ఇక్బాల్‌ అబ్దూల్లా నాటౌట్‌ 6, సునిల్‌ నరీన్‌ (సి) దినేష్‌ కార్తిక్‌ (బి) మెక్‌ జాన్సన్‌ 3, బాలాజీ (బి)మలింగ 0. ఎక్సాట్రాలు : 9 ( బైస్‌-0, వైడులు-0, నోబాల్‌-0, లెగ్‌ బై-9, ఫెనాల్టీ-0)

మొత్తం : 105 (18.2 ఓవర్లకు 10 వికెట్లు)

వికెట్ల పతనం : 1-1(గంభీర్‌ 0.4), 2-38(మన్విందర్‌ బిస్లా 6.1), 3-54(యూసఫ్‌ పఠాన్‌ 8.3), 4-58(కలిస్‌ 9.5), 5-77(ఇవొయిన్‌ మోర్గాన్‌ 12.2), 6-89(దెబబ్రటా దాస్‌ 13.6), 7-89(మెక్‌ లారెన్‌ 14.1), 8-97(రాజత్‌ భాటియా 15.6), 9-104(సునిల్‌ నరీన్‌ 17.4), 10-105(జాన్సన్‌ 18.2).

ఢిల్లీ బౌలింగ్‌ : జాన్సన్‌ 4-0-13-2, అహ్మద్‌ 3-0-18-1, ఓజా 4-0-23-2, మలింగ 4-0-15-0, హార్భజన్‌ సింగ్‌ 4-0-27-3.

స్టార్లను బ్రాండ్‌ అంబాసిడర్లుగా చేసుకుంటున్నాయి. జట్టుకు దీపిక బ్రాండ్‌ అంబాసిడర్‌గా