ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో జీరో ఖాతా క్యాంప్
ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి:కొత్తగూడ ఇండియన్ బ్యాంక్ మేనేజర్ బాలజ్యోతి
కొత్తగూడ సెప్టెంబర్ 20 జనంసాక్షి:కొత్తగూడ మండలంలోని పోగళ్ళపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా జీరో అకౌంట్ క్యాంప్ నిర్వహించారు.ఈ క్యాంపులో బ్రాంచ్ మేనేజర్ బాలజ్యోతి మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం ఖాతాపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ప్రతి ఒక్కరూ ఖాతాను తీసుకోవాలని ఎలాంటి డబ్బులు లేకుండా ఉచితం ఖాతాలు అందించడం జరుగుతుందని ఇట్టి అవకాశాన్ని విద్యార్థులు సద్విని చేసుకోవాలని కోరారు.ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఉండాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ పథకం ద్వారా ప్రజలు ముఖ్యంగా పేదలు వారి కష్టార్జీతాన్ని బ్యాంక్ ఖాతాలలో పొదుపు చేసుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదుగుటకు వీలు కలుగుతుంది.అంతేగాక కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న అభివృద్ది,సంక్షేమ ఫలాలు లబ్ధిదారునికి నేరుగా వారి ఖాతాలలోకి జమ చేయడానికి వీలవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ భద్రయ్య,ప్రధానోపాధ్యాయులు గుమ్మడి లక్ష్మీనారాయణ,ఉపాధ్యాయులు సుమన్,బ్యాంకు మిత్రలు రాజు,లక్ష్మణ్,శ్రీరాములు,సారం గపాణి,శివ, కుమారస్వామి,అశోక్,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.