ఇండియాకు రానున్న గీతా
– తల్లిదండ్రులను గుర్తించిన యువతి
– 15 ఏళ్ల తరువాత తల్లి ఒడికి
పాకిస్థాన్ అక్టోబర్ 15 (జనంసాక్షి):
పాకిస్థాన్ లో ఉన్న గీత తిరిగి భారత్ రాబోతోంది. దాదాపు పన్నేండేళ్ల తర్వాత తన తల్లితండ్రుల ఒడి చేరబోతోంది. బజరంగీ భాయిజాన్ సినిమా పుణ్యమా అని గీత?మొత్తానికి తన వాళ్లను కలిసే అదృష్టాన్ని దక్కించుకుంది. గీతను భారత్ తిరిగి తీసుకొచ్చేందుకు భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. త్వరలోనే ఆమెను భారత్ కు తీసుకువస్తున్నామని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్లో తెలిపారు.పన్నెండేళ్లుగా అయిన వారికి దూరంగా ఉన్న గీత?రాత మారింది. ఆనాథగా ఉన్న ఆమెకు త్వరలోనే తల్లితండ్రులను కలుసుకోబోతున్నారు. ఇక శాశ్వతంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండేలా భారత విదేశాంగ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. పాక్ అధికారులతో మాట్లాడి?భారత్ కు ఆమె తిరిగి అప్పగించేందుకు ఒప్పించింది. దీంతో త్వరలోనే గీతాను భారత్ కు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.బాలీవుడ్ లో ఈ మధ్యే సంచలనం సృష్టించిన బజరంగీ భాయిజాన్ సినిమా?గీత జీవితాన్నే మార్చేసింది. ఇంచుమించు ఈ సినిమా కథే గీతాదీ. సినిమా పాక్ కు చెందిన ఓ చిన్న పాప?భారత్ లో తప్పిపోతుంది. ఆమెను తిరిగి తల్లితండ్రుల వద్దకు చేర్చేందుకు హీరో చేసే ప్రయత్నమే ఈ సినిమా. ఐతే గీతా ఇలాంటి పరిస్థితిని పన్నెండేళ్ల క్రితమే ఎదుర్కొంది. పుట్టుకతోనే మూగ, చెవిటి లక్షణాలు ఉన్న ఆమె బీహార్ లో బార్డర్ వద్ద 11 ఏళ్ల వయసులో తప్పిపోయారు. ఆ తర్వాత పాక్ చేరుకున్నారు. మూగ, చెవిటి కావటంతో ఎవరికీ తన సమస్య చెప్పలేకపోయారు.పాక్ లోని కరాచీలో ఈది పౌండేషన్ వారు గీతకు ఆశ్రయం ఇచ్చారు. కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్నారు. ఆమెకు ప్రత్యేక గది ఏర్పాటు చేసి?హిందూ దేవతలను పూజించే అవకాశం కూడా కల్పించారు. గీతను తన తల్లితండ్రులకు అప్పగించేందుకు ఈది పౌండేషన్ ఎన్ని ప్రయత్నాలు చేసిన సఫలం కాలేదు. దీంతో అంతా ఆశలు వదులుకున్నారు. కానీ బజారంగీ భాయిజాన్ సినిమాతో గీత దీనగాథ ప్రపంచానికి తెలిసింది. ఆమె స్టోరీ తెలుసుకున్న పాక్?భారత్ అధికారులు తల్లితండ్రులకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు.ఇక్కడి వరకు బాగానే ఉన్న గీతా తల్లితండ్రులను గుర్తించటం మాత్రం ఓ సవాల్ గా మారింది. ఆమె పరిస్థితి తెలిసి వెంటనే భారత్ లోని నాలుగు ఐదు కుటుంబాలు తమ కుతూరంటే?తమ కూతురంటూ ముందుకు వచ్చారు. దీంతో గీత నిజమైన తల్లితండ్రులెవరన్నదీ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నాలుగు కుటుంబాల వారి ఫోటోలను గీతకు చూపించగా ఆమె తల్లితండ్రులను గుర్తుపట్టారు. గీత గుర్తించిన వారు ప్రస్తుతం బీహార్ లో ఉంటున్నారు. ఐతే డీఎన్‌ఎ టెస్ట్ జరిపించిన తర్వాతే తల్లితండ్రులకు అప్పగిస్తామని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు.భారత్, పాక్ లు దాయాది దేశాలైన గీత విషయంలో మాత్రం రెండు దేశాలు మానవత్వాన్ని చాటుకున్నాయి. ఈది పౌండేషన్ చొరవతో రెండు దేశాల అధికారులు ప్రత్యేకంగా తమ ప్రయత్నాలు చేశారు. ఇక రెండు దేశాల ప్రజలు సైతం గీతను తల్లితండ్రులకు అప్పగించనుండటంపై సోషల్ విూడియా సంతోషం వ్యక్తం చేశారు.