ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి : కలెక్టర్
హైదరాబాద్, ఆగస్టు 7 (జనంసాక్షి): జిల్లాలోని ఇబ్రహింపట్నం, యాచారం, ఘట్‌కేసర్, బం ట్వారం, కుల్కచర్ల మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మందకొడిగా సాగుతుందని, దీన్ని వేగిర పర్చాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శేషాద్రి సంబంధిత హౌసింగ్ ఇంజనీర్లను ఆదేశించారు. ఇంది రమ్మ గృహ నిర్మాణాల పురోగతిపై మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కలెక్టర్ జూలై మాసాంతానికి 8వేల ఇళ్లుకు గాను, 5,224 ఇళ్లు పూర్తయ్యాయని, పురోగతి తక్కువ గానున్న మండలాల డిఈలు, ఎఈలు ప్రత్యేక శ్రద్దతో ఆయా ఇళ్లను పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు ఈ నెలాఖరు కల్లా మిగిలిన ఇళ్లన్ని నిర్మించేలా లబ్ధిదారులను ఎడ్యుకేట్ చేయాలని ఆయన ఆదేశించారు. నిర్మాణాన్ని మొదలుపెట్టని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయాలని ఆయన ఆదేశించారు. ఇళ్ల బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఫిర్యాదులకు తావులేకుండా త్వరితగతిన ఆయా లబ్ధిదారులకు డబ్బు చెల్లించాలని ఎఈలను ఆదేశించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ఇన్‌ఛార్జి ప్రాజెక్టు డైరెక్టర్, మోహన్, డిఈలు, ఎఈలు తదితరులు పాల్గొన్నారు.