ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో అన్నదానం

మునగాల, సెప్టెంబర్ 25(జనంసాక్షి): మునగాల మండలం ముకుందాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో మహాలయ పక్షం పెద్దల పండుగ సందర్భంగా పితృదేవతలకు పూర్వీకుల పేరున చేసే దానాలలో భాగంగా ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో ఆదివారం అన్నదానం కార్యక్రమం నిర్వహించి పండ్లు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇటీవల నరసింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు వేమూరి సత్యనారాయణ పిలుపులో భాగంగా చిలుకూరు మండల పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన గన్నా పిచ్చయ్య కనకమ్మ దంపతుల కుమారుడు గన్నా ఉపేంద్రవర్మ కీర్తి దంపతులు అన్నదానం నిర్వహించి పండ్లు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాత ఉపేంద్రవర్మ మాట్లాడుతూ, ఇలా అనాధ వృద్ధాశ్రమంలో పెద్దల పండుగ నిర్వహించుకోవటం ఎంతో సంతోషంగా ఉందని, భవిష్యత్తులో ఈ ఆశ్రమానికి తనకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తామని, ప్రతి ఒక్కరూ ఆడంబరాలకు పోకుండా ఇలాంటి వృద్ధాశ్రమంలో అనాధలకు మానసిక వికలాంగులకు వృద్ధులకు తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సామాజిక ఉద్యమకారులు వేమూరి సత్యనారాయణ, దాతలు గన్నా పిచ్చయ్య కనకమ్మ దంపతుల కుమారుడు గన్నా ఉపేంద్రవర్మ కీర్తి, ఆరాధ్య, అమరగాని రాజేష్, ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ, నీలమ్మ, షేక్ పాషా తదితరులు పాల్గొన్నారు.