*ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో అన్నదానం*

మునగాల, అక్టోబర్ 23(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో కోదాడ పట్టణానికి చెందిన  యలమంచిలి శ్రీనివాసరావు కుమారుడు ఆదిశేషసాయి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆశ్రమంలో ఉన్న అనాధలకు, వృద్ధులకు ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించి స్వీట్స్ పంచి పండ్లు పంపిణీ చేశారు. నడిగూడెం మండల పరిధిలోని కేశవాపురం గ్రామానికి గుజ్జర్లపూడి విజయ్ కుమార్ సహకారంతో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఇలా సందర్భమేది అయినా ఇలాంటి వృద్ధాశ్రమంలో అనాధలకు మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి వారికి అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దాత యలమంచిలి శ్రీనివాసరావు, ఆశ్రమం నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ, షేక్ పాషా, నీలమ్మ, షేక్ సోందు   తదితరులు పాల్గొన్నారు.