ఇందుర్తి లో చింతపూల ముత్యాలు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నేతలు…..
జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 6:
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన చింతపూల ముత్యాలు ఇటీవల మరణించగా దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, హైదరాబాద్ యూసుఫ్ గూడా కార్పొరేటర్ బండారి రాజ్ కుమార్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
వారితోపాటు రైతుబంధు కోఆర్డినేటర్ చింతపూల అంజయ్య, మాజీ జెడ్పీటీసీ అందే స్వామి ,లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాదె రఘునాథ్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎస్కే సిరాజ్ ,మాజీ ఎంపిటిసి ఆకుల మొగిలి, అందే చిన్న స్వామి, మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షులు కూన మల్లయ్య రిటైర్డ్ టీచర్ చింతపూల కొమురయ్య చింతపూల రంగయ్య చింతపూల ఈశ్వరయ్య తిరుపతి సాయన్న నాగయ్య రాజు తదితరులు పాల్గన్నారు.