ఇక రెండేళ్లకోమారు ప్రవాసభారతీయ దివస్‌

న్యూఢిల్లీ,మే8(జ‌నం సాక్షి):   ప్రస్తుతం ఏటా నిర్వహిస్తున్న ప్రవాస భారతీయ దినోత్సవాన్ని 2019 నుంచి రెండేళ్లకొకసారి నిర్వహించనున్నట్టు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ప్రకటించారు. ‘సామర్థ్య నిర్మాణం- కృత్రిమ మేధ వంటి అంశాల్లో ప్రవాస భారతీయుల పాత్ర’, ‘ప్రవాసులు మాతృభూమికి చేయగలిగిందేమిటి? భారత్‌ ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంలో ప్రవాస భారతీయుల పాత్ర’ వంటి అంశాలతో థీమ్‌ ఆధారిత సెషన్లను నిర్వహిస్తామని, వాటిలో పాల్గొనేందుకు ఎన్నారైలతోపాటు ఇక్కడి వారినీ ఆహ్వానిస్తామని ఆమె వివరించారు.