ఇక లాటరీ ద్వారా మద్యం షాపులు – సర్కారు కొత్త ఎక్సైజ్‌ విధానం

హైదరాబాద్‌, జూన్‌ 18 (జనంసాక్షి):
రాష్ట్రంలో మద్యం సిండికేట్ల దందాలను అరిక ట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా కొత్త మద్యం విధానాన్ని సోమవారం ప్రకటించింది. ఇకపై ఓపెన్‌ టెండర్‌ విధానంలో కాక లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయి స్తారు. ఇప్పటి వరకు ఉన్న దరఖాస్తు ధరను రూ. పది వేల నుంచి 25 వేలకు పెంచారు. జనాభా ప్రాతిపదికన లైసెన్స్‌ ఫీజులను నిర్ణయిం చారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొత్త మద్యం విధానంలో పొందుపర్చారు. గరిష్ట ధరకు మిం చి సరుకు అమ్మినవారి లైసెన్స్‌ను రద్దు చేస్తారు. అలాగే నిబంధనలను ఉల్లంఘించిన షాపులను వెనక్కి తీసుకుని బెవరేజెస్‌ సంస్థ ద్వారా ఆ షాపులను నిర్వహించాలని కొత్త విధానంలో పేర్కొన్నారు. ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన కొత్త విధానంలో జనాభా ప్రాతిపదికన లైసెన్స్‌ ఫీజులు ఈ విధంగా ఉన్నాయి. 10 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్‌ ఫీజు రూ. 32 లక్షలు, 10 వేల నుంచి 50 వేల వరకు జనాభా ప్రాంతాల్లో సైసెన్స్‌ ఫీజు రూ.34 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షల వరకు జనాభా ప్రాంతాల్లో సైసెన్స్‌ ఫీజు రూ.46 లక్షలు, 3 లక్షల నుంచి 5 లక్షల వరకు జనాభా ప్రాంతాల్లో సైసెన్స్‌ ఫీజు రూ.46 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల వరకు జనాభా ప్రాంతాల్లో సైసెన్స్‌ ఫీజు రూ.64 లక్షలు, 20 లక్షలకు మించి జనాభా ఉన్న ప్రాం తాల్లో లైసెన్స్‌ ఫీజు రూ.1.04 కోట్లు చొప్పున నిర్ణయించింది. సోమవారంనాడు కొత్త మద్యం విధానంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆర్థి క శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు అందుబాటులో ఉన్న మంత్రులతో ప్రత్య క్షంగాను, ఫోన్‌ద్వారా సమీక్షించారు. ఇంతకు ముందే ఈ విధానంపై కసరత్తు చేసేందుకు ముఖ్యమంత్రి ఒక సబ్‌కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్మన్‌, మంత్రి పార్థసారధి విదేశాల్లో ఉన్నందున నేడు ఆయనతో టెలిఫో న్‌లో సంప్రదించారు. ఈ కమిటీ కర్ణాటక, తమి ళనాడులో అమలవుతున్న మద్యం విధానాన్ని అధ్యయనం చేసింది.మద్యం షాపుల వేలం విధా నానికి స్వస్తి పలికి లాటరీ ద్వారా షాపులను కేటాయించే విధానాన్ని రూపొందించింది. ఇప్ప టి వరకు అమల్లో ఉన్న ఓపెన్‌ టెండర్‌ విధానం ప్రకారం ధనవంతులకే షాపులు దక్కేవి. దీంతో పెద్ద మొత్తాలలో వేలం పాటలో షాపులు పొంది ఆ డబ్బును రాబట్టుకునేందుకు పలు అడ్డదోవలు తొక్కేవారు. ఈక్రమంలో ఎక్సైజ్‌, పోలీసు శాఖల కు కూడా ముడుపులు ఇచ్చేవారు. ఇటీవల మద్యం సిండికేట్లపై ఏసీబీ దాడులు నిర్వహించ డంతో తెర వెనక బాగోతాలు బయటపడిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ప్రైవేటు ఆపరేటర్ల సంఘం ప్రతినిధి ఒకరు రవాణా శాఖ అధికారులతో మంతనాలు జరిపేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే రవాణాశాఖ మంత్రి పేషీ అధికారులతో కూడా వ్యవహారాన్ని నడిపించేందుకు ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తోంది.బినామీ దారులకు, తెల్లరేష న్‌ కార్డుదారుల పేర్లపై షాపులు పొంది అక్రమా లకు పాల్పడుతున్న వారికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం లాటరీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఉన్న 6,596 మద్యం దుకాణాలకు అదనంగా ఈ సారి మరో 700 దుకాణాలను కేటాయించనున్నారు. వీటిలో 300 దుకాణాలను ప్రభుత్వం ప్రయోగత్మాకంగా నిర్వహించాలని నిర్ణయించారు.