లక్ష్మారెడ్డిపల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ

 

 

 

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో శనివారం స్థానిక సర్పంచ్ వీరమల్ల సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని అర్హులైన మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంపత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన వారికి అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శరత్ బాబు, ఎడ్ల ప్రియాంక, వివోఏ సునీతా రెడ్డి, గ్రామ మహిళా అధ్యక్షురాలు మిరియాల సునీత రెడ్డి, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.