ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు కేసీఆర్

కల్యాణ లక్ష్మి నిరుపేదలకు వరం అలంపూర్ శాసనసభ్యులు అబ్రహం అలంపూర్ సెప్టెంబర్ 09(జనంసాక్షి) ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అనిఅలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ అబ్రహం అన్నారు.
అలంపూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాల వారికి 660మంది లబ్ధిదారులకుశుక్రవారం ఆసరా పెన్షన్ కార్డులు మరియు 43 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అలంపూర్ లోని B.R.S. ఫంక్షన్ హాల్ నందు నేరుగా లబ్దిదారులకు పంపిణీ చేసిన అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి.సరిత చెతులమీదగా పంపించేశారు.
సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో ఆసరా పింఛన్లు ఇస్తున్నట్టు తెలిపారు. ఒక్క తెలంగాణలో మాత్రమే గౌరవ సీఎం కేసీఆర్‌ హయాంలో పింఛన్‌ లబ్ధిదారులకు ప్రతినెలా రూ.2,016 చొప్పున అందజేస్తున్నట్టు అన్నారు . బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా రూ.2,016 పింఛన్లు ఇవ్వడం లేదని, దీన్ని ప్రజలు గమనించాలన్నారు. ఆసరా పెన్షన్లతో వృద్ధుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌ దక్కిందన్నారు. కేసీఆర్ ని ‌విమర్శించే ప్రతిపక్షాలకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్‌ గారు ఈ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు.
గతంలో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే పెద్ద వ్యాపారస్తుల తో అప్పు చేసి పెళ్లి చేయాల్సిన పరిస్థితి ఉండేది. నేడు లక్ష నూట పదహారు రూపాయలు అందజేసి ఇవ్వడం ఆడపడుచు అండగా పెద్దన్నగా నిలిచారు,పెళ్లి సమయంలో ఒక వేళ అప్పు చేసిన అప్పులు తీర్చి ధైర్యం తల్లిదండ్రులకు ఇచ్చి అండగా నిలిచిన నాయకుడు కెసిఆర్ కళ్యాణ లక్ష్మి రూపంలో వారిని ఆదుకుంటున్నామన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరు సంతోషంగా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని సీఎం కోరిక అని తెలిపారు .మహిళలు ఈ కళ్యాణలక్ష్మి డబ్బులను వృధా చేయకుండా అవసరానికి వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల చైర్మన్లు వైస్ చైర్మన్లు మరియు వివిధ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు వివిధ వార్డుల కౌన్సిలర్లు మరియు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు అధికారులు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.