ఇటలీలో భారీ భూకంపం

5

– 73కు చేరిన మృతులు

రోమ్‌,ఆగస్టు 24(జనంసాక్షి): ఇటలీ దేశాన్ని భారీ భూకంపం కుదిపేసింది. బుధవారం తెల్లవారుజామున దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ భూప్రకంపనలు సంభవించాయి. ఈ విలయ ధాటికి మృతుల సంఖ్య రెట్టింపు స్థాయిలో పెరుగుతోంది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 73కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. పెరుగియా నగరానికి 76 కి.విూల దూరంలో ఉన్న రీటి ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.ఇటలీ రాజధాని రోమ్‌లోనూ 20 సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలాయి. ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందగా.. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు శిథిలాల నుంచి బయటికి తీసేందుకు చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.భూకంపం ధాటికి ఎమాట్రిస్‌ నగరం పూర్తిగా ధ్వంసమైందని నగర మేయర్‌ సర్జియో పిరోజీ తెలిపారు. నగరం నడిబొడ్డున భారీ భవనాలు కుప్పకూలిపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినట్లుస్థానికులు తెలిపారు. భూకంప తీవ్రతను ముందుగా గుర్తించే యూఎస్‌జీఎస్‌ పేజర్‌ సిస్టమ్‌ ఇటలీలో రెడ్‌అలర్ట్‌ ప్రకటించింది. 2009లో ఇటలీలోని అకీలా ప్రాంతంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ ఘటనలో 300 మంది ప్రాణాలు కోల్పోయారు.భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. రాజధాని రోమ్‌లోనూ 20 సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటి తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.2గా నమోదైంది. రీటి ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక బృందాలు శిథిలాల నుంచి బయటికి తీసేందుకు చర్యలు చేపట్టాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి ఎమాట్రిస్‌ నగరం ధ్వంసమైనట్లు నగర మేయర్‌ సర్జియో పిరోజీ తెలిపారు. నగరం నడిబొడ్డున భారీ భవనాలు కుప్పకూలిపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. భూకంప తీవ్రతను ముందుగా గుర్తించే యూఎస్‌జీఎస్‌ పేజర్‌ సిస్టమ్‌ ఇటలీలో రెడ్‌అలర్ట్‌ ప్రకటించింది. ఇటలీలో సంభవించిన భూకంప తీవ్రతను తెలియజేస్తూ ఎనలిస్ట్‌ బ్రూనో తన అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఫొటోలు పోస్ట్‌ చేశారు. 2009లో ఇటలీలోని అకీలా ప్రాంతంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ ఘటనలో 300 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి తక్కువనే చెబుతున్నారు. అయితే ఇళ్లు కూలిపోవడంతో పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద కొందరు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. అమెట్రిసే పట్టణంలో భారీగా నష్టం సంభవించి ఉండవచ్చని ప్రాథమిక అంచనా. సహాయ కార్యక్రమాలు ప్రారంభించిన ఇటలీ ప్రభుత్వం శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది.తెల్లవారు జామున 3.36గంల అంబ్రియా ప్రాంతంలోని నోర్సియా పట్టణానికి సవిూపంలో ఇది సంభవించినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. మొత్తం పది కిలోవిూటర్ల మేర ఈ భూకంపం ప్రభావం పడినట్లు పేర్కొంది. ఈ భూకంపం కారణంగా అమాట్రిస్‌ అనే టౌన్‌ దాదాపు సగం నేలమట్టం అయిందని, శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయి ఉంటారని ఆ టౌన మేయర్‌ ఆందోళన వ్యక్తం  చేశారు. వంతెనలు కూలిపోయాయని, కొండచరియలు భారీగా విరిగిపడ్డాయని చెప్పారు. ఇది అత్యంత ఘోరమైన భూకంపం అని అసలు ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఎంత జరిగి ఉంటుందనే విషయంపై తమ వద్ద ఇంకా వివరాలు లేవని అగ్నిమాపక సిబ్బంది అధికారులు చెబుతున్నారు. ప్రకంపనలు ముందే పసిగట్టిన చాలామంది బయటకు పరుగులు తీశారని, అయినప్పటికీ శిథిలాల కింద చాలామంది ఉన్నట్లు తాము భావిస్తున్నారు. మధ్య ఇటలీలోని అకుమోలి, అమాట్రిస్‌, పోస్టా, అర్క్వాటా డెల్‌ ట్రోంటో, కారి ప్రాంతాలు దీని భారిన పడినట్లు చెప్పారు. హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. రోమ్‌ నగరానికి 150 కిలోవిూటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. సహాయక చర్యలు ముమ్మరం చేశారు.