ఇటీవల తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందగా వారి అనాధ పిల్లలకు  నేను ఉన్నానంటూ పదివేల ఆర్థిక సాయం. తోపాటు చదువుకోడానికి ప్రతి నెల స్కాలర్ షిప్ అందించిన

యఫ్ టీవీ  అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి వీణవంక ఆగస్టు 26  ( జనం సాక్షి ) వీణవంక మండలంలోని బొంతుపల్లి గ్రామానికి చెందిన శ్రీరాముల సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా  వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ   యఫ్ టీవీ అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి తల్లిదండ్రులు కోల్పోయిన  ఈ అనాధ పిల్లలకు ఆర్థిక సహాయంగా తన అనుచరుల చేత 10 పది వేల రూపాయలు ఈ కుటుంబానికి ఆర్థిక సహాయం తోపాటు ఈ అనాధ పిల్లలు చదువుకోవడానికి పేదరికం అడ్డు రాకూడదని ప్రతి నెల 1000 ఒక వెయ్యి రూపాయలు స్కాలర్ షిప్ అందిస్తానని పాడి ఉదయ్ నందన్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. అనంతరం బొంతుపల్లి గ్రామస్తులు పాడి ఉదయ్ నందన్ రెడ్డి కి గ్రామ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొంతుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మహంకాళి రాజ్ కుమార్.చదువు శంకర్ రెడ్డి. దాసరపు లోకేష్ అమృత ప్రభాకర్. సమీళ్ల ప్రకాష్. దాసారపు వంశీకృష్ణ. చిన్నాల శ్రీకాంత్. తాళ్లపల్లి కుమార స్వామి. శేఖర్. పస్తం కుమార్. ప్రశాంత్.. అఖిల్. తోపాటు తదితరులు పాల్గొన్నారు.