ఇటీవల మరణించిన వారి కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ!

సిరికొండ: జయశంకర్ భూపాలపల్లి (ప్రతినిధి) జూలై    జనం సాక్షి: ఇటీవల జిల్లాలోని భూపాలపల్లి,గణపురం మండలాలలో మరణించిన వారి కుటుంబాలను తెలంగాణ తొలి శాసనసభాపతి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి బుధవారం పరామర్శించినారు. భూపాల్ పల్లి మండలం లోని కొంపల్లి గ్రామానికి చెందిన మురహరి నికిత, మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు లోగల సెగ్గంపల్లి కి చెందిన పోకూరి రాజేష్ మరణించగా అలాగే గణపురం మండలంలో  కర్కపల్లి గ్రామానికి చెందిన కన్నూరు నరసయ్య, మైలారం గ్రామానికి చెందిన మచ్చఅమృతమ్మ ల ఇటీవల మరణించడం జరిగింది. ఆయన వారి కుటుంబాలను పరామర్శించి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపి వారి కుటుంబ సభ్యులకు

ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. మండలంలోని గణపసముద్రం పరువలు తొక్కుతూ న దృశ్యాన్ని ఆయన సందర్శించారు. ఆయన వచ్చిన విషయం తెలుసుకున్న మండలంలోని కొంతమంది టిఆర్ఎస్ కార్యకర్తలు మామిడి నరసింహ స్వామి, డాక్టర్ జేన్నయ్య, చాంద్ పాషా, ఎస్కే రబ్బాని లతోపాటు మరి కొంతమంది ఆయన వద్దకు వెళ్లి అభినందించడం జరిగిందన్నారు.