ఇద్దరు దారుణహత్య
కర్నూలు జూలై 27 : నగర సమీపంలోని కార్బైట్ ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఫ్యాక్టరీ వద్దవున్న డాబాలో ఇద్దరు వ్యక్తులు భోజనం చేస్తుండగా రెండు ఆటోల నుంచి పంది మంది వ్యక్తులు వచ్చి కత్తులతో దాడి చేసి ఇద్దర్ని హత మార్చి వెళ్ళినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. జిల్లా ఎస్పీ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ హత్యకు గురైన వ్యక్తులు ఇదివరకు నాగరాజు అనే వ్యక్తిని హత్య చేసినట్లుగా స్థానికులు తెలిపారు. దొరసామిరాజు(46), సాల్మన్ (45) అనే వ్యక్తులు దారుణహత్యకు గురైనట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఎస్పీ వివరించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి పోలీస్‌నిపుణుల బృందంతో పాటు పోలీస్ డాగ్‌లను కూడా రంగంలోకి దింపారు.