ఇబ్రహీంపట్నం లో మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినేని.సంతోష్ కుమార్ ప్రచారం
రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, మార్చ్ 06(జనంసాక్షి):-
మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ఉపాధ్యాయులను, అధ్యాపకులను కలిసి క్రమ సంఖ్య-4 కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టీచర్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అయినేని.సంతోష్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా విద్య రంగ సమస్యల్ని పట్టించుకొనే వారు లేక పోవడంతో విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యలు పెరిగిపోయాయని
చట్ట సభలలో ప్రశ్నిస్తాం అని చెపుతున్న వారు, వారి నాయకులు ఇప్పటికే ఆయా సభాల్లో ఉన్నారు కదా ఎందుకు ప్రశ్నించడం లేదు ? ఎందుకు మాట్లాడటం లేదు?
అయ సభలల్లో ప్రాంతీయ, జాతీయ పార్టీల నాయకులు,వివిధ సంఘాల నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా ఎంపీలుగా కొనసాగుతున్నారు కదా, కనీసం విద్యారంగం గురించి ఎందుకు ప్రశ్నించడం లేదు. ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల విషయంలో, పిఆర్సి విషయంలో జరుగుతున్న అన్యాయాలపై ముందుండి పరిష్కారం అయ్యే వరకు పోరాడుతానని అన్నారు
సి పి ఎస్ విధానాన్ని రద్దు చేసే వరకు ముందుండి పోరాడుతానని ప్రైవేట్ విద్యాసంస్థలల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు గత కొన్ని సంవత్సరాలుగా శ్రమ దోపిడికి గురవుతున్నారు. కనీస జీతం రాదు, ఉద్యోగ భద్రత కరువైంది.ప్రైవేటు ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వంపై వత్తిడి చేసి బోర్డు ఏర్పాటుకి కృషి చేస్తానని తెలియజేస్తున్నా. ఉద్యోగ భద్రత కల్పించే విధంగా కృషిచేస్తానని తెలియజేస్తున్నా. నెలవారీగా జీతాలు అందేలా కృషి చేస్తానని స్పష్టంగా తెలియజేస్తున్నాను.మహిళా ఉద్యోగులకి ఆరు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను అమలు చేసే విధంగా కృషి చేస్తాను.విద్య రంగ సమస్యలు పరిష్కారం కోసం, విద్యార్థుల భవిష్యత్ కోసం విద్యార్థుల ఫీజుల పై ప్రత్యేక ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటుకి ముందుండి ఏర్పాటు అయ్యే వరకు పోరాడుతానని ఆయా ప్రభుత్వ కళాశాలలో, వివిధ యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల , కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాడతానని తెలిపారు వివిధ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల, అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాడుతానని మార్చి 13వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొని మీ యొక్క అమూల్యమైన ఓటును క్రమసంఖ్య 4 వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు