ఇవాల్టి నుంచే కస్టమర్లకు అందుబాటులోకి ఫ్రీడమ్ 251 !
తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్లు అందిస్తామంటూ ప్రకటించిన రింగింగ్ బెల్స్ కంపెనీ ఎన్నో వివాదాలకు కేరాఫ్‌గా నిలిచింది. ఎట్టకేలకు వివాదాలను దాటుకుని ‘ఫ్రీడమ్ 251’ బుక్ చేసిన కస్టమర్లకు డెలివరీ చేసేందుకు కంపెనీ సిద్దమైంది. తొలివిడతలో 2,240 ఫోన్లను వినియోగదారులకు అందించనుంది. ఇవాల్టి నుంచే డెలివరీ చేయనున్నారు. మొదటగా నాలుగు రాష్ట్రాల్లో ఈ ఫోన్లను అందించనున్నారు. హిమాచల్ ప్రదేశ్, బీహార్, హర్యానా, ఉత్తరాఖాండ్ రాష్ట్రాల్లో కస్టమర్లు ముందుంగా ఈ చవక ఫోన్లను అందుకోనున్నారు. అయితే మొదట నుంచి చెప్పినట్లు 251 రూపాయలకు ఫోన్ ఇవ్వరు. షిప్పింగ్ ఛార్జీలు 40 రూపాయలు అదనం. అంటే మొత్తం 291 రూపాయలు చెల్లించాలన్నమాట.