ఇసుక మాఫియాపై అధికారుల దాడులు, 120 ట్రాక్టర్ల పట్టివేత
సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని మానేరు వాగు కేంద్రంగా సాగుతున్న ఇసుక మాఫియాపై రెవెన్యూ అధికారులు దాడులు చేపట్టారు. ఇక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్న 120 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సందర్భంగా ట్రాక్టర్ యజమానులు ఓ రెవెన్యూ అధికారిపై దాడికి యత్నించారు. దీంతో ట్రాక్టర్ యజమానులపై తహసిల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.