ఇసుక రీచ్ ల వద్ద వే బిల్ లోని వివరాల భారీ ఫ్లెక్సీలు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి…..
జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో
జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య…
ములుగు బ్యూరో,సెప్టెంబర్28(జనం సాక్షి):-
ఇసుక రీచ్ ల వద్ద వే బిల్ లోని వివరాల భారీ ఫ్లెక్సీలు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు.
బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఇసుక స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక లారీల రూట్ మ్యాప్ వివరాలు తెలిపర్చలన్నారు.ఇసుక లారీలు ఓవర్ లోడ్ వెళ్లకుండా రూల్స్ ప్రకారం వాహనాలను సీజ్ చేయాలన్నారు.ఇసుక లారీలు సాయంత్రం 6 గంటల వరకు లోడింగ్ పూర్తి చేసుకొని 9 గంటల వరకు గమ్యస్థానాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ములుగు, ఏటూరునాగారం బ్రాహ్మణపల్లి ఇసుక రీచ్ ల వద్ద భారీ ఫ్లెక్సీలు సూచిక బోర్డులు కచ్చితంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.చెక్ పోస్టుల వద్ద సిబ్బంది నియామకానికి టీఎస్ ఎండిసీ నుండి సిబ్బంది జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
జిల్లాలో ఓవర్ లోడ్ తో రాత్రి వేళల్లో లారీల నడవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని,ఓవర్ లోడ్ లారీల వల్ల జాతీయ రహదారులు ధ్వంసం అయిన నేపథ్యంలో దెబ్బతిన్న రోడ్డు ల వివరాలతో ప్రతిపాదనలు పంపించాలన్నారు.
ఇసుక లారీలు అతివేగంతో వచ్చే వాటిని కచ్చితంగా నియంత్రించాలని అతిక వేగాన్ని నియంత్రించడానికి సూచిక బోర్డులు స్పీడ్ బ్రేకర్లు రేడియం స్టిక్కర్స్ సిబ్బంది యూనిఫామ్ ధరించి చెక్ పోస్టుల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కే.రమాదేవి,ఏడి మైనింగ్ రామాచారి,ఏడిఎస్ఎల్ ఆర్. సుదర్శన్,తహసిల్దార్లు సంజీవ,ఎం శ్రీనివాస్, ఎం సత్యనారాయణ స్వామి, వెంకట, కృష్ణారావు, బాబురావు,సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.