ఈటెల రాజేందర్ విశ్వాస ఘాతకుడు
ఈటెల రాజేందర్ విశ్వాస ఘాతకుడు
హుజూరాబాద్‌లో ఓటమి భయంతో గజ్వెల్ పాట
దమ్ముంటే బిజెపిలో చేరే వారిపేర్లు బయటపెట్టాలి
విూజేజెమ్మ దిగి వచ్చినా టిఆర్‌ఎస్‌ను ఏవిూ చేయలేరు
విూడియా సమావేశంలో బాల్క సుమన్,గువ్వల విమర్శలు
హైదరాబాద్,జూలై26(జనంసాక్షి): హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విశ్వాస ఘాతకుడని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. ఆయన తిన్నింటి వాసాలను లెక్కబెట్టారని మండిపడ్డారు. 2004కు ముందు ఈటెల అడ్రస్ ఎక్కడ..? ఈటెలను మంత్రి చేసింది కేసీఆర్ కదా? అని సుమన్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, కేపీ వివేకానందతో కలిసి బాల్క టీఆర్‌ఎస్ ఎల్పీలో విూడియాతో మాట్లాడారు. ఈటెల రాజేందర్ మాటలను చూసి జనం నవ్వుకుంటున్నారని సుమన్ పేర్కొన్నారు. ఆయన శిఖండి రాజకీయాలు చేస్తున్నారు. ఆరోగ్య మంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఈటెల అవినీతికి పాల్పడ్డాడని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో హుజురాబాద్‌లో రాజేందర్ ఓటమి ఖాయమ న్నారు. అందుకే గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. ఈటెల కేసీఆర్‌పై పోటీ చేసే సిపాయా? అని ప్రశ్నించారు. ఆయన ఓ చెల్లని రూపాయి అని విమర్శించారు. పబ్లిసిటీ కోసమే ఈటెల ఈ తంటాలు పడుతున్నారని పేర్కొన్నారు. బీజేపీలో ఈటెలది బానిస బతుకు అని తెలిపారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ బీజేపీ కండువా కప్పుకుని రాజకీయాలు మాట్లాడితే మంచిదని బాల్క సుమన్ సూచించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటానికి గవర్నర్ ఎవరు? అని నిలదీశారు. గవర్నర్ రాజకీయం చేస్తున్న తీరును విూడియా కూడా ఖండిరచాలన్నారు. గతంలో గవర్నర్లు హుందాగా ప్రవర్తించేవారు. క్లౌడ్ బరస్ట్ గురించి మాట్లాడటానికి గవర్నర్ ఏమైనా శాస్త్రవేత్తనా అని సుమన్ ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ది వ్యాపార నైజం.. ఆయనకు ఏ సిద్దాంతం లేదని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. కమ్యూనిస్ట్ కమ్యునలిస్ట్‌గా మారారని విమర్శించారు. గజదొంగల పార్టీలో చేరిన ఈటెల నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అనామకుడైన ఈటెలను సీఎం కేసీఆర్ మంత్రిని చేశారని బాలరాజు గుర్తు చేశారు. ఈటెలకు బీజేపీలో ఏం ప్రత్యేకత ఉందని ఆయనతో ఇతర పార్టీల వారు టచ్‌లో ఉంటారని ప్రశ్నించారు. రాజేందర్‌కు దమ్ముంటే.. ఆయనతో టచ్‌లో ఉన్నవారి పేర్లను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ తెలంగాణలో ఎదగడానికి అవకాశం లేదన్నారు. తెలంగాణలో బీజేపీ సింగిల్ డిజిట్ కూడా దాటదని స్పష్టం చేశారు. తెలంగాణ లో ప్రభుత్వాన్ని పడగొట్టడం మోదీ జేజమ్మ తరం కూడా కాదని బాలరాజు తేల్చిచెప్పారు. విూ జేజమ్మ దిగి వచ్చినా.. విూ మోడీ, అమిత్ షా వచ్చినా మా ప్రభుత్వాన్ని ఏమి చేయలేరని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. చాలా మంది టీఆర్‌ఎస్ లీడర్లు బీజేపీ తో టచ్ లో ఉన్నారని ఇటీవల హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే చేరికలుంటాయని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఒక్కరన్న మా వాళ్ళు టచ్ లో వుంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అదే నిజమైతే.. ఆధారాలు బయట పెట్టాలని బాలరాజు అన్నారు. తెలంగాణలో చిచ్చు పెడితే తగిన రీతిలో బుద్ది చెప్తామని ఆయన స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ లీడర్లు ఇష్టం లేకపోయినా పార్టీలో కొనసాగుతున్నారని ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్న విషయం తెలిసిందే.