ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారుల మృతి

నెన్నెల : ఆదిలాబాద్‌ జిల్లా నెన్నెల మండలంలోని గంతూరు గ్రామంలో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గ్రామానికి చెందిన బంటు, చింటు, అనంద్‌ అనే చిన్నారులు సమీపంలో ఉన్న జోగాపూర్‌ మత్తలివాగు చెరువులో ఈతకు వెళ్లి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృత దేహాలను వెలికితీసి విచారణ చేపట్టారు.