బీసీ 42 శాతం రిజర్వేషన్లకు సహకరించండి

` చేతకాకపోతే భాజపా ఎంపీలు రాజీనామా చేయండి
` రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనకడుగు వేయదు
` ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం
` అవసరమైతే న్యాయపోరాటానికి కూడా వెనకాడం
` కేంద్రం దీనిని వెంటనే ఆమోదించి చిత్తశుద్ధి చాటాలి
` రామచంద్రరావు లీగల్‌ నోటీసులకు జడిసేది లేదు
` మీడియాతో డిప్యూటీ సీఎం సిఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్‌(జనంసాక్షి):బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై న్యాయపరమైన సమస్యలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ డిప్యూటీ- సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కులగణన సర్వే ఆధారంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. సచివాలయంలో విూడియాతో ఆయన మాట్లాడుతూ.. బిసి రిజర్వేషన్లలో వెనక్కి పోయే ప్రసక్తి లేదని అన్నారు. కులగణన అవసరం లేదని భాజపా మొదట మాట్లాడిరది. తెలంగాణ ప్రభుత్వం, రాహుల్‌ గాంధీ ఒత్తిడితో జనగణనలో కులగణన చేరుస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి వద్ద పెండిరగ్‌లో ఉంది. ఈ బిల్లుకు పార్లమెంట్‌లో అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తాం. కులగణనను క్యాబినెట్‌లో, శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించాం. అసెంబ్లీలో మద్దతు తెలిపిన పార్టీలు పార్లమెంట్‌లోనూ మద్దతు తెలపాలి. ఆర్డినెన్స్‌ గవర్నర్‌ ఆమోదం పొందగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ముందుకెళ్తాం అని అన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన ఆధారంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గవర్నర్‌ ఆర్డినెన్స్‌ జారీ చేయగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ముందకెళ్తామని స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని, అసెంబ్లీలో మద్దతు తెలిపిన పార్టీలు పార్లమెంట్లో కూడా పోరాటం చేయాలని కోరారు. ఈ బిల్లు త్వరగా ఆమోదం పొందే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని రాహుల్‌ గాంధీ హావిూ ఇచ్చారని.. ఆయన చెప్పిన మాట ప్రకారమే రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కుల గణన నిర్వహించామని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో కులగణన అంశం తెరపైకి రావడంలో తెలంగాణ రాష్టాన్ర్రిది కీలక పాత్ర అని పేర్కొన్నారు. తెలంగాణలో కులగణన చేసిన తర్వాతే దీనిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైందన్నారు. కులగణన సర్వేను చాలా పకడ్భందీగా, పారదర్శకంగా నిర్వహించామని అందుకే తెలంగాణను చూసి కేంద్ర ప్రభుత్వం కూడా కుల గణన చేస్తామని ప్రకటించిందన్నారు. తెలంగాణ జరిగిన విధానమే రేపు దేశవ్యాప్తంగా అమలు కానుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కులగణన, జనగణన చేయడానికి ఇంకా చాలా సమయం ఉందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఏవైనా న్యాయపరమైన సమస్యలు వస్తే ఎదుర్కొవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.భారత రాష్ట్ర సమితి ప్రజలను మభ్యపెట్టింది. అందరూ అలాగే చేస్తారని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారేమో. కులగణన సర్వేను చాలా పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాం. అందుకే తెలంగాణను చూసి కేంద్రం కూడా కులగణనను ప్రకటించిందని భట్టి అన్నారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు రామచందర్‌రావుకు బీసీలంటే చిన్నచూపు ఉన్నట్లుంది. ఆయన పంపిన లీగల్‌ నోటీసులకు ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. నోటీ-సులకు భయపడేది లేదని కౌంటర్‌ ఇచ్చారు. నోటీసులు అందిన తరువాత ఏవిధంగా సమాధానం చెప్పాలో తనకు తెలుసన్నారు. రామచందర్‌ రావుకి దళితులన్నా బడుగు బహీన వర్గాలన్నా చిన్న చూపని విమర్శించారు. రోహిత్‌ వేముల ఆత్మహత్య చేసుకోవడానికి రామచందర్‌ రావు కూడా కారణమంటూ ఇటీవల భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రివార్డుగా బీజేపీ అధిష్టానం ఆయనకు తెలంగాణ చీఫ్‌ పదవి ఇచ్చిందని ఆరోపించారు. రామచందర్‌ రావుకు తెలంగాణ చీప్‌ పదవి ఇవ్వడంపై బీజేపీ అధిష్టానం ఒకసారి పునరాలోచించాలని భట్టి అన్నారు. భట్టి వ్యాఖ్యలను తప్పుబట్టిన రామచందర్‌ రావు తన న్యాయవాదితో లీగల్‌ నోటీ-సులు పంపించారు. మూడు రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. లేకపోతే రూ.25 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని రామచందర్‌ రావు నోటీ-సుల్లో హెచ్చరించారు. దీనిపై క్రిమినల్‌ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచించారు.

మొదటి నుంచీ బీజేపీది బీసీ వ్యతిరేక వైఖరే..
` రిజర్వేషన్లు అసాధ్యం అనడం ఆ బీజేపీ అసలు స్వరూపాన్ని బయటపెడుతోంది
` అందుకే వ్యతిరేకిస్తోంది
` మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అసాధ్యం అనడం బీజేపీ అసలు స్వరూపాన్ని బయటపెడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. బిజెపి మాట్లాడుతున్న తీరు దాని బిసి వత్యిరేకతను బయటపెట్టిందన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో పక్క రాష్ట్రం తమిళనాడులో ఇదే విధమైన రిజర్వేషన్లు అమలు అయ్యాయి. సుప్రీంకోర్టు ఇందిరా సహనీ కేసులో స్పష్టంగా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ప్రమాణితమైన సమాచారం, ఎంపెరికల్‌ డేటా ఉంటే వారు రిజర్వేషన్‌ నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం సర్వే చేసింది, కేబినెట్‌ ఆమోదం తీసుకుంది, శాసనసభ ఆమోదం పొందింది. గవర్నర్‌ ఆమోదంతో అది ఇప్పుడు ఢల్లీిలో ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు రిజర్వేషన్ల కోసం రాజీనామా చేయాలి. నిజంగా బీసీల పక్షాన నిలబడాలని ఉంటే, రిజర్వేషన్లు అమలయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చూపాలి. లేకపోతే బీసీల పట్ల కుట్ర చేస్తూ ఉంటారని భావించాలని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. అనాడు మండల కమిషన్‌ను వ్యతిరేకించింది బీజేపీయే. ఇప్పుడు మళ్లీ బీసీల రిజర్వేషన్లపై వక్రబుద్ధిని చూపిస్తోంది. తెలంగాణలోని అన్ని బీసీ సంఘాలు ఈ కుట్రను గమనించి రిజర్వేషన్‌ హక్కులను కాపాడేందుకు ముందుకు రావాలని పొన్నం పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది. మా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీల పక్షాన నిలుస్తున్నారు. మా పీసీసీ అధ్యక్షుడు కూడా బీసీ వర్గానికే చెందినవారు. మా వర్గాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. అదే సమయంలో, బీజేపీపై విరుచుకుపడుతూ, విూరు ముఖ్యమంత్రి బీసీ అని, సిఎల్పీ నాయకుడు బీసీ అని మభ్యపెడతారు. కానీ పార్టీ అధ్యక్ష పదవిని బీసీ వర్గానికి ఇవ్వని విూరు, మళ్లీ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారు. ఇది విూ అసలు స్వరూపం అని మంత్రి ఆరోపించారు.

బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్‌, భాజపా మోకాలడ్డు
` మతం రంగు పులిమి బిల్లును కేంద్రం ప్రభుత్వం రాష్ట్రపతి వద్దకు పంపలేదు:కవిత
హైదరాబాద్‌(జనంసాక్షి):బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కాంగ్రెస్‌, భాజపా కుట్ర చేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును శాసనసభ, మండలిలో ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిందన్నారు. కానీ రిజర్వేషన్లకు మతం రంగుపులిమి రాష్ట్రపతి వద్దకు కేంద్రం ప్రభుత్వం పంపలేదని కవిత ఆరోపించారు. ‘’రాష్ట్రంలో భాజపాకు ఓట్లు రావని తెలిసే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చలేమని మాట్లాడారు. ఉత్తరాది రాష్ట్రాల్లో 50 శాతం పైగా రిజర్వేషన్లు అమలు చేస్తూ.. దక్షిణాదిలో న్యాయపరమైన సమస్యలు అంటూ దాటవేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు 50 సార్లు దిల్లీ వెళ్లినా.. ఈ అంశంలో ప్రధానిపై ఒత్తిడి తేలేదు. అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్తే 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ వేసి రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించాలి’’ అని కవిత డిమాండ్‌ చేశారు.